Three Died In Gas Cylinder Blast Incident In Hyderabad Jeedimetla: హైదరాబాద్‌లోని జీడిమెట్ల రాంరెడ్డి నగర్‌లో ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు చెందారు. అయితే.. ఈ పేలుడు వెనుక పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ముగ్గురిని చంపేసి, గ్యాస్ సిలిండర్ పేలినట్లు సీన్ క్రియేట్ చేశారని భావిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌కు చెందిన ఎనిమిది యువకులు కొన్నాళ్ల క్రితం జీడిమెట్లలోని రాంరెడ్డి నగర్‌లో ఓ ఇల్లు అద్దుకు తీసుకున్నారు. కాగా.. మంగళవారం నాడు కూడా వారి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ ఇంటి నుంచి కొట్టుకున్నట్టుగా పెద్దగా అరుపులు కూడా వచ్చాయని స్థానికులు చెప్తున్నారు.
కట్ చేస్తే.. సాయంత్రం ఆ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల నుంచి మృతదేహాలకు ఫైర్, పోలీస్ అధికారులు బయటకు తీసుకొచ్చారు. ఆ మృతదేహాల్ని పరిశీలించిన తర్వాత.. పోలీసులకు అనుమానం వచ్చింది. దీనికితోడు.. వారి మధ్య ఉదయమే పెద్ద గొడవ జరిగిందన్న విషయం తెలియడంతో.. మిగతా వాళ్లు కలిసి, ఆ ముగ్గురిని హత్య చేసి ఉంటారని, గ్యాస్ సిలిండర్ పేలి వాళ్లు మృతి చెందినట్టు సీన్ రీక్రియేట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. కేసు నమోదు, దర్యాప్తు చేపట్టారు. మృతుల పేర్లు తెలియాల్సి ఉంది.