Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Gangavaram Si Venkatesh Caught In Acb Trap For %e2%82%b920000 Bribe Demand

Gangavaram SI Bribe Case :కౌన్సిలింగ్ పేరుతో లంచం డిమాండ్.. ఎస్సై అరెస్ట్

Published Date :February 14, 2026 , 10:01 pm
By Gogikar Sai Krishna
  • అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ కు వివాహేతర సంబంధం
  • మొదటి భార్య ఫిర్యాదుతో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
  • కేసు సర్దుబాటు చేయాలంటే రూ. 20వేలు లంచం డిమాండ్
  • లంచం కోసం ఎస్సై వెంకటేష్ డిమాండ్
Gangavaram SI Bribe Case :కౌన్సిలింగ్ పేరుతో లంచం డిమాండ్.. ఎస్సై అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కంచె చేను మేస్తుందనే సామెత గుర్తుందా? పోలవరం జిల్లాలోని గంగవరం పోలీసులకు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఓ ఎస్సై, కానిస్టేబుల్ దొరికిపోవడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం డివిజన్‌లో గంగవరం పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అవినీతి బాగోతం వెలుగు చూసింది..

ఓ వివాహేతర సంబంధం కేసులో గంగవరం స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ లంచం డబ్బులు తీసుకుని అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మొదటి భార్య గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా ఎస్సై వెంకటేష్ ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో కేసు విషయాన్ని సర్దుబాటు చేయాలంటే 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వాలని ఎస్సై వెంకటేష్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే శివ కుమార్.. డబ్బు ఇచ్చుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్సై వెంకటేష్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. లేని పక్షంలో కేసును కఠినంగా నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!

అంతేకాక.. నగదు తన చేతికి అందేంత వరకు శివకుమార్ సెల్‌ఫోన్‌ను తన వద్దనే ఉంచుకున్నట్లు బాధితుడు తెలిపారు. న్యాయం చేయాల్సిన ఎస్సై… డబ్బు డిమాండ్‌పై విసిగిపోయిన శివకుమార్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ట్రాప్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసింది…

ఏసీబీ అధికారులు ముందుగా సాక్షుల సమక్షంలో నగదు నోట్లపై రసాయన పౌడర్ పూసి బాధితుడికి అందించారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ముందుగా ప్లాన్ చేసిన విధంగా శివకుమార్ కానిస్టేబుల్ వీరబాబుకు 15,000 రూపాయాలు నగదు అందజేశాడు. నగదు స్వీకరించిన వెంటనే అక్కడే గస్తీ కాస్తున్న ఏసీబీ అధికారులు దాడి చేసి కానిస్టేబుల్ వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. రసాయన పరీక్షల్లో ఈయన చేతులకు పౌడర్ ఆనవాళ్లు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో, ఎస్సై వెంకటేష్ సూచన మేరకు తాను డబ్బు తీసుకున్నట్లు కానిస్టేబుల్ వీరబాబు వెల్లడించారు..

అనంతరం ఎస్సై వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డబ్బు డిమాండ్ చేసిన ఆధారాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం వ్యవహారంలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం కేసును సర్దుబాటు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి…

Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • gangavaram-si-venkatesh-acb-trap-bribery-case

తాజావార్తలు

  • T20 World Cup 2026 Prize Money: టీ20 వరల్డ్ కప్‌తో పాటు భారీ ప్రైజ్ మనీ.. ఏ జట్టు ఎంత అందుకంటే?

  • Suryakumar Yadav: ధోని సరసన సూర్య.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..

  • మార్చి 28న ప్రారంభం కానున్న IPL 2026.. త్వరలో పూర్తి షెడ్యూల్ విడుదల.!

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions