Nitish Kumar Reddy: “సారీ సార్.. మా బౌలింగ్ చాలా స్ట్రాంగ్”.. విమర్శకులకు నితీష్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓటమి పాలైంది. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లో 65 పరుగుల భారీ విజయంతో పుంజుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్, 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52), అభిషేక్ శర్మ (48), ట్రావిస్ హెడ్ (46) ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఛేజింగ్‌లోకి దిగిన కేకేఆర్161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 21 పరుగులకు 3 వికెట్లు తీసి స్టార్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. అయితే.. ఈ మ్యాచ్ అనంతరం తెలుగు తేజం నితీష్ శర్మ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ దళం బలహీనంగా ఉందన్న వాదనలను ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కొట్టిపారేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అంటే కేవలం విధ్వంసకర బ్యాటింగ్ మాత్రమే కాదు, తమ బౌలింగ్ సైతం అంతే పదునైనదని స్పష్టం చేశాడు. జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగ, డేవిడ్ పేన్ వంటి అనుభవజ్ఞులైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు బౌలింగ్ విభాగానికి బలం చేకూరుస్తారని తెలిపాడు.
READ MORE: PBKS vs CSK: టాప్ లేపిన పంజాబ్ కింగ్స్.. వరుస ఓటములతో డీలా పడ్డ చెన్నై..!
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నితీష్ కుమార్ సమాధానమిస్తూ.. “క్షమించండి సార్, మా బౌలింగ్ విభాగం మీరు అనుకుంటున్నంత బలహీనంగా లేదు. జయదేవ్ ఉనద్కత్, ఈషాన్ మలింగ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు చాలా బాగా రాణిస్తున్నారు. డేవిడ్ పేన్ (David Payne) సైతం బాగా రాణిస్తున్నాడు. కాబట్టి మాది బలహీనమైన బౌలింగ్ విభాగం అని నేను అనుకోవడం లేదు.” అని స్పష్టం చేశాడు. మేము ఆడుతున్న క్రికెట్ శైలి, స్కోర్‌బోర్డుపై మేము నమోదు చేస్తున్న స్కోర్లు చూస్తే మా బ్యాటింగ్ చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, మా బౌలింగ్ విభాగం సైతం స్ట్రాంగ్‌గా ఉందని మరోసారి తెలిపాడు. KKRతో జరిగిన మ్యాచ్‌లో పవర్‌ప్లేలో పేసర్లు ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ, వెంటనే స్పిన్నర్లను రంగంలోకి దించి ఫలితాన్ని రాబట్టామని నితీష్ తెలిపారు. పిచ్ కండిషన్స్‌ను బట్టి ప్లాన్స్ మార్చుకోవడమే తమ విజయానికి కారణమని, రింకూ సింగ్ వంటి ప్రమాదకర బ్యాటర్లను స్లోయర్ బంతులతో బోల్తా కొట్టించగలిగామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?