Site icon NTV Telugu

Tragedy : పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

Murder

Murder

Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్‌కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్‌ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విన్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

గత నెల 17న తేజస్విన్‌ను “భూమి కొలవాలి” అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. పూడూరు శివారులో కారులోనే అతడిని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా.. ఐశ్వర్యతో కూడా తిరుమల్‌ రావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే.. ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి, అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.

Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

గతంలో ఐశ్వర్యను తిరుమల్ రావు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తిరుమల్‌ రావు భార్య నిరాకరణ కారణంగా ఐశ్వర్యను తాత్కాలికంగా వెనక్కి పంపినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, అన్ని పాత్రలు బయటపడే వరకు ఈ కేసు మరింత మిస్టరీగా మారనుంది. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి ఒక అమాయకుడి జీవితాన్ని బలిగొన్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.

Vijayawada: గోల్డ్ మార్కెట్‌లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!

Exit mobile version