Site icon NTV Telugu

Corporator Arrest:గడ్డి అన్నారం కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డి అరెస్టు

Kidnapcase

Kidnapcase

గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ మహేశ్వర్ రెడ్డి అరెస్టయ్యారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి జడ్జి ఇంటికి తీసుకొని వెళ్లారు పోలీసులు. జడ్జి నివాసంలో ప్రేమ్ కుమార్ రెడ్డిని ప్రవేశపెట్టనున్నారు సరూర్ నగర్ పోలీసులు.
కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తో పాటు మరో తొమ్మిది మందిని యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో మరో ఐదుగురు పరారీలో వున్నట్టు తెలుస్తోంది. పరారీలో మరో కీలక నిందితుడు లంకా మురళి వున్నాడు. లంకా మురళి కిడ్నాప్ కు గురైన యువకుడి బాబాయ్.

హైదరాబాద్ పి అండ్ టి కాలని కిడ్నాప్ కేసులో గడ్డి అన్నారం కార్పోరేటర్ మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి, ఈ కిడ్నాప్ కేసులో కీలక సూత్రదారి గడ్డిఅన్నారం బీజేపీ కార్పోరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని అని ఆరోపణలు రావడంతో పోలీసులు స్పందించారు. కార్పొరేటర్ పై ఐపీసీ 363,364,367, 382,324R/w120(b) సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు సరూర్ నగర్ పోలీసులు. మహేశ్వర్ రెడ్డి సహా తొమ్మిది మందిని రిమాండ్ కు తరలిస్తారు. ఈ కేసులో మొత్తం పదిహేను మంది నిందితులు వున్నారు. వీరిపై కిడ్నాప్, బెదిరింపు, కుట్ర ల కింద కేసులు నమోదు చేశారు. సుబ్రమణ్యం అనే యువకుడిన మొన్న అర్ధరాత్రి కిడ్నాప్ చేశారు.

హైదరాబాద్ లో కిడ్నాప్ చేసి నల్లగొండ జిల్లా చింతపల్లిలో బంధించారు నిందితులు.. మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో కిడ్నాప్ చేసినట్టు నిర్దారించారు పోలీసులు. సిసి కెమెరాలో కిడ్నాప్ అయిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. డబ్బు , కార్లు సమకూర్చిన కార్పొరేటర్ మహేశ్వర్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.

బాధితుడు సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలను తెలిపాడు. “గురువారం రాత్రి ఇంట్లోకి వెళుతుండగా నన్ను కొట్టి కార్లో ఎక్కించుకొని తీసుకొని పోయారు. కారులో వెళ్ళేటప్పుడే నన్ను చిత్రహింసలకు గురి చేశారు. చింతపల్లి వద్ద ఉన్న ఒక శివాలయం దగ్గరికి తీసుకెళ్లి నన్ను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. గంజాయి తాగి ఆ సిగరెట్లతో నా ఒంటిపై కాల్చారు. నన్ను నరబలి చేస్తామని స్నానం చేసి రావాలని పంపించారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుండగా ఎస్ఓటి టీం వచ్చి నన్ను కాపాడారు. కార్పొరేటర్ కి ఎదురు వెళ్లడంతో పాటు మా బాబాయితో ఉన్న ఆస్తి తగాదాల విషయంలో కిడ్నాప్ చేశామని చెప్పారు. మొత్తం 12 మంది కలిసి నన్ను కొట్టారని సుబ్రహ్మణ్యం వివరించాడు. నేను నా తండ్రి కలిసి ఓ మైనర్ బాలికను రేప్ చేశామని ఒప్పుకోవాలంటూ వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోలన్నీ పోలీసులు సీజ్ చేశారని సుబ్రహ్మణ్యం వెల్లడించాడు.

Read Also: హీరో దుల్కర్ సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలు

Exit mobile version