ఈమధ్య కాలంలో గృహోపకరణ వస్తువులైన గీజర్లు, ఫ్రిడ్జ్ లు, సిలిండర్లు పేలిపోతున్నాయి. కారణాలు ఏవైనా అనేకమంది గాయాల పాలవుతుంటే.. కొందరు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పుష్ప అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
Read ALso: Aadi Saikumar: ‘అతిథి దేవో భవ’తో ఆరంభం… ‘టాప్ గేర్’తో ముగింపు!
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఫుట్ పాత్ పై పళ్ళ వ్యాపారం చేసుకుంటున్న పుష్ప అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో సుమారు లక్ష రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితురాలు పుష్ప చెబుతున్నారు. ఎవరికీ ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బీహార్ లో సిలిండర్ పేలి..
బీహార్ లో ఇటీవల శాహ్‌గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం వంట సిద్ధం చేస్తోన్న సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం ప్రసాదం తయారు చేసే పనిలో నిమగ్నం కాగా .. షార్ట్‌సర్క్యూట్ కారణంగా సిలిండర్లకు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాహ్‌గంజ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అనిల్ గోస్వామి కుటుంబ సభ్యులు ఛత్ పూజ కోసం ప్రసాదం తయారు చేస్తుండగా కొన్ని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. ఇది గ్యాస్ లీక్‌కు దారితీసింది, భారీ మంటలకు కారణమైంది, దానిని ఆర్పడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది తీవ్రమైంది. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు.
లంగర్ హౌజ్ లో గీజర్ పేలి….
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో గత నెలలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. బాత్‌రూంలో గీజర్ (Geyser) పేలి నవదంపతులు మృతిచెందారు. లంగర్‌హౌస్‌లోని ఖాదర్‌భాగ్‌కు చెందిన డాక్టర్ ఉమ్మాయ్ మెహిమాన్ సాహిమ, డాక్టర్ నిసారుద్దీన్ భార్యాభర్తలు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది. నిసారుద్దీన్ సూర్యాపేటలోని ప్రభుత్వ దవాఖానలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బాత్‌రూమ్‌లో ఉన్న గీజర్ పేలింది. దీంతో డాక్టర్లు ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
Read Also:Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.
