NTV Telugu Site icon

Tragedy: ఇటుక బట్టీ గోడ కూలి నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు మృతి..

Haryana

Haryana

హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని నలుగురి చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాము నిద్రిస్తున్న సమయంలో ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు తీవ శోక సంద్రంలో మునిగిపోయారు…

Read Also: Heavy Rains in AP: ఏపీలో మరో 3 రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..

వివరాల్లోకి వెళ్తే.. హిసార్ జిల్లా నార్నాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుడానా గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇటుక బట్టీ గోడ కూలింది. దీంతో.. అక్కడే నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయిన చిన్నారులలో సూరజ్ (9), నందిని (5), వివేక్ (9), నిషా మూడు నెలలు చిన్నారిగా గుర్తించారు. మరోవైపు.. గౌరీ (5) అనే చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. కాగా.. ఆ చిన్నారిని హిసార్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Asaduddin Owaisi: పార్లమెంట్‌లో పాలస్తీనా నినాదం.. ఒవైసీకి బరేలీ కోర్టు సమన్లు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన ఇటుక బట్టీలో పనిచేసే కూలీల కుటుంబాలకు చెందిన పిల్లలు. ఈ కేసులో బాధిత కుటుంబాలు ఇంకా ఫిర్యాదు చేయలేదని.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Show comments