Gun Fire : హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదం నేపథ్యంలో గాల్లోకి కాల్పులు జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. సమాచారం ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలో ఉన్న ఓ స్థలాన్ని ఖాళీ చేయాలని ప్రభాకర్ స్థానికులను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
Kolkata Protest: SIR కు వ్యతిరేకంగా సీఎం భారీ ర్యాలీ..
ఈ క్రమంలో ఆయన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత ప్రభాకర్ అనుచరులు వచ్చి బాధితులను స్థలంలోనుంచి బయటకు గెంటేసి, ఆ గేట్‌కి తాళాలు వేసినట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. కాల్పుల ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వాదనను సాక్ష్యాలతో కలిపి పరిశీలిస్తున్న పోలీసులు, కాల్పులు జరిగిన గన్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.
Rahul Gandhi: “అగ్ర కులాల చేతిలో దేశ సైన్యం”.. రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు..
