Crime: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్..
- మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం..
- వీడియో తీసి బ్లాక్‌మెయిల్..
- ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఒక మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్‌పై ఒక కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పటేల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ అస్లాంపై తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటికే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
నివేదిక ప్రకారం.. ఇటీవల మహిళా ఎస్ఐ ఒక కొండ ప్రాంతం నుంచి డెహ్రాడూన్‌కి బదిలీ అయ్యారు. సంఘటన జరిగిన రోజు తన డ్యూటీ లొకేషన్ దూరంగా ఉండటంతో, డెహ్రాడూన్‌లోని ఒక హోటల్‌లో బస చేయాలని నిర్ణయించుకున్నానని, కానిస్టేబుల్‌ని ఒక గది బుక్ చేయాలని అడిగానని ఆమె చెప్పింది. హోటల్ చేరుకున్న తర్వాత కానిస్టేబుల్ రూం తనిఖీ చేసే ఉద్దేశంతో లోపలికి వచ్చి, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. నిందితుడైన కానిస్టేబుల్ తనపై అత్యాచారం చేయడంతో పాటు సంఘటనను వీడియో రికార్డ్ చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. ఎవరికైనా చెబితే, ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతా అని బ్లాక్‌మెయిట్ చేసినట్లు బాధితురాలు చెప్పింది.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
Read Also: Green Card: గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన “శాశ్వత నివాసం” కాదు: యూఎస్ వైస్ ప్రెసిడెంట్..
ఘటన తర్వాత మానసిక ఒత్తిడికి గురైన బాధితురాలు సెలవు తీసుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. విధులకు తిరిగి వచ్చిన తర్వాత కూడా నిందితుడైన కానిస్టేబుల్, ఆ వీడియోను ప్రస్తావిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి, అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డినట్లు తెలుస్తోంది. ఈ అఘాయిత్యం గురించి చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కఠినమైన అత్యాచార సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసుని పర్యవేక్షించే బాధ్యతను రూరల్ ఎస్పీకి అప్పగించినట్లు, సీనియర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఆరోపణలు రుజువైతే, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..