NTV Telugu Site icon

Crime: పరువు హత్య..కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి..అవాక్కైన పోలీసులు

Gonda Honour Killing.jpg (1)

Gonda Honour Killing.jpg (1)

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శుక్రవారం ఉదయం పోస్టు వద్దకు చేరుకున్న వ్యక్తి తన కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్‌స్టేషన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను ప్రారంభించారు.

READ MORE: NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్

సిబిగంజ్ పోలీసుల సమాచారం ప్రకారం..పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి, ఫతేగంజ్ వెస్ట్‌లో నివసించే విజేంద్ర అలియాస్ బడాను ప్రేమించింది. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో ఆ యువకుడిపై బాలిక తండ్రి గురువారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పోలీసులు జైలుకు పంపారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాజంలో చెడ్డపేరు రావడంతో తండ్రి గురువారం రాత్రి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. సిబిగంజ్ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.

READ MORE:Uttarpradesh : షాకింగ్.. ఏడో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి

స్టేషన్ కు వెళ్లి తన కూతురుని తానే హత్య చేసి వచ్చానని పోలీసులకు చెప్పాడు. మృతదేహం ఇంట్లో పడి ఉందని తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. పర్సఖేడా ఔట్‌పోస్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తారు.

Show comments