Site icon NTV Telugu

Faridabad: కోడలు పారిపోయిందని అత్తమామలు ఆరోపణ.. 10 అడుగుల గుంతలో మృతదేహం లభ్యం

Haryana

Haryana

Faridabad: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలతో కలిసి ఓ మహిళను దారుణంగా చంపేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు శవాన్నీ అందులో పూడ్చి పెట్టేశారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని అసత్య ప్రచారం చేసారు. అయితే, రెండేళ్ల క్రితం అరుణ్ తో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధించడంతో ఏడాది పాటు సదరు వివాహిత తనూ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొంత డబ్బు అప్పజెప్పి అత్తింట్లో దిగబెట్టగా.. అత్తింటి వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇక, మృతురాలి సోదరి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రెండు నెలల తర్వాత ఈ దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Harsha Kumar: బనకచర్ల ప్రాజెక్టుపై హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు..

అయితే, ఈ ఘటనలో దారుణ హత్యకు గురైన వివాహిత ‘తనూ’ మృతదేహాన్ని శుక్రవారం నాడు 10 అడుగుల గుంతలో నుంచి పోలీసులు బయటకు తీశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో హత్య జరిగి సుమారు రెండు నెలలకు పైనే కావొచ్చని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తనూ భర్త, అత్తమామలు, మరో దగ్గరి బంధువుతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనూ అత్తింటి వారితో నివసించిన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద ఈ మృతదేహాన్ని ఉన్నట్లు కనిపెట్టారు. అయితే, గత రెండు నెలల క్రితం మురుగు నీటి కాలువ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో ఓ గుంతను తవ్వినట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు.

Read Also: CM Omar Abdullah: పాక్ ఆర్మీ చీఫ్- డొనాల్డ్ ట్రంప్ భేటీపై జమ్ముకాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఇక, ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్‌కు, షికోహాబాద్ కు చెందిన తనూకు 2023లో పెళ్లైంది. వివాహం జరిగిన తర్వాత కొద్ది నెలలకే అత్తింట్లో వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె సోదరి ఆరోపించింది. తన సోదరిని అత్తింటి వారు బంగారం, డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా హింసించారని తెలిపింది. తమ కుటుంబం శక్తి మేర వారి డిమాండ్లను కొంతమేర తీర్చినా, వేధింపులు ఆగలేదని బోరున విలపించింది. అయితే, ఏప్రిల్ 9వ తేదీన తన సోదరికి ఫోన్ చేసినప్పుడు కలవకపోవడంతో.. అనుమానం వచ్చింది, ఏప్రిల్ 23న అత్తింటివారు తనూ ఇంటి నుంచి ఎవరితోనో పారిపోయిందని తమకు చెప్పారని ప్రీతి వెల్లడించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చాలా రోజుల పాటు వారు కూడా ఈ కేసును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తిం చేసింది.

Exit mobile version