NTV Telugu Site icon

Cyber ​​Fraud: ఫేస్ బుక్‌లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!

Face Book Cyber Froud

Face Book Cyber Froud

Cyber ​​Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి అతనితో మాటలు కలిపాడు. హౌస్ లోన్ కావాలంటే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితుడికి నమ్మించేందుకు నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డును సైబర్ కేటుగాడు పంపాడు. దీంతో బాధితుడు హౌస్ లోన్ కావాలని తెలిపాడు. ఇదే అలుసుగా భావించిన కేటుగాడు.. లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలంటూ నమ్మించాడు. దీని కోసం ఇన్సూరెన్స్ కొరకు ఫోన్ పే ద్వారా రూ.3500 పంపాలని కేటుగాడు కోరాడు.

Read also: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..

అయితే బాధితుడు రూ.3500 లను ఫోన్ ద్వారా పంపాడు. ఆతరువాత సైబర్ కేటుగాడు హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ కింద అమౌంట్ పంపాలంటూ బాధితుడిని కోరారు. మొదట ఇన్సూరెన్స్ అన్నారు, ఇప్పుడు ప్రాసెసింగ్ అమౌంట్ ఏమిటి అని ప్రశ్నించారు. లోన్ కావాలంటే ఇవన్నీ ప్రాసెసింగ్ చేయాలని లేదంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని నమ్మించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా కలిపి ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్‌లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..

Show comments