NTV Telugu Site icon

Noida: రోజుకు రూ.400 సంపాదన.. పెద్ద డాన్ కావాలని కల.. కట్ చేస్తే..

Crime

Crime

బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ ‘దబాంగ్’ సల్మాన్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. సంపాదన గురించి చెప్పాలంటే రోజూ రూ.400-500 సంపాదిస్తున్నాడు. తయ్యబ్ నోయిడాలో తన మామతో కలిసి ఉంటున్నాడు. అతని తల్లి బరేలీ జిల్లా ముదియా హఫీజ్ గ్రామంలో నివసిస్తోంది. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. తన కొడుకు తెలివితక్కువతనంతో అలాంటి పని చేశాడని అతని తల్లి చెప్పింది. తన సోదరుడు వినోదం కోసం బెదిరింపు సందేశాలు పంపి ఉంటాడని అతని ఇద్దరు సోదరీమణులు చెబుతున్నారు.

READ MORE: Free Gas Cylinder Scheme: ఉచిత గ్యాస్‌పై కన్ఫ్యూజ్ వద్దు.. ఆ కార్డులకు ఆధార్‌ లింక్‌ ఉంటే అర్హులే..!

తయ్యబ్ మామ ఇర్షాద్ అలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. “పోలీసులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో సోదాలు చేశారు. కానీ వారికి అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. నోయిడాకు వచ్చిన తర్వాత నా మేనల్లుడు మద్యానికి బానిసయ్యాడు. అతను అలాంటి పని చేశాడంటే మేము ఇప్పటికీ షాక్‌లో ఉన్నాము.” అని తెలిపారు.

READ MORE:Kunamneni Sambasiva Rao: ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయాలి..

ఈ కేసులో తయ్యబ్ పేరు వెలువడటంతో గ్రామ ప్రజలు కూడా ఆశ్చర్యం, ఆందోళన చెందుతున్నారు. ఆ యువకుడు నివాసంఉన్న పొరుగు వ్యక్తి ఇలా అన్నాడు. “తయ్యబ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతని తండ్రి టైలర్. కానీ తయ్యబ్ ఒక గూండాలా వ్యవహరించేవాడు. అతను తరచుగా తనంతట తానుగా వివాదాలలో చిక్కుకుంటాడు. గూండాగా సమాజంలో పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. డాన్ కావాలనేది అతని కల. ” అని తెలిపారు.

READ MORE: New York City: ఫలించిన హిందూ సంఘాల ఉద్యమం.. అమెరికాలో దీపావళి రోజున పాఠశాలలు బంద్..

డిప్యూటీ ఎస్పీ (నోయిడా) ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. “తయ్యబ్ నోయిడా సెక్టార్ 92లోని ఒక నిర్మాణ స్థలంలో పని చేస్తున్నాడు. అక్కడ అతని రోజువారి కూలీ రూ. 400 నుంచి రూ. 500. అతని అరెస్టు తర్వాత.. విచారించి కుటుంబీకులకు సమాచారం అందించాం. ముంబై పోలీసుల బృందం అతనిని తమతో తీసుకెళ్లింది.” అని తెలిపారు.

Show comments