Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీతో పాటు బాలీవుడ్ 'దబాంగ్' సల్మాన్ ఖాన్‌కు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని బెదిరించన వ్యక్తిని పోలీసులు మంగళవారం నోయిడాలో అరెస్ట్ చేశారు. అతడి వయసు 20 ఏళ్లు మాత్రమే. అతని పేరు మహమ్మద్ తయ్యబ్ అలీ. వృత్తిరీత్యా కార్పెంటర్, నోయిడాలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.
Baba Siddique : ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ (అజిత్ పవార్) అధినేత బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. బాబా సిద్ధిఖీ షూట్ ఔట్ కేసులో పాకిస్థాన్ సంబంధం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.