దేశంలో ప్రొఫెసర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య దేవోభవ అనే పదానికే మచ్చ తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి.. పిల్లల్ని ప్రయోజకులనుగా మార్చాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒడిశాలో ప్రొఫెసర్ వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇక కర్ణాటకలో చదువు నేర్పించే క్రమంలో ఇద్దరు ప్రొఫెసర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ వేధింపులు తాళలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
గ్రేటర్ నోయిడా విశ్వవిద్యాలయ విద్యార్థిని బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్జరీ (BDS) రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని బాలికల హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ మేరకు శనివారం పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టానికి తరలించారు. విద్యార్థిని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: China: టీఆర్‌ఎఫ్‌ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
పోలీసు అధికారుల ప్రకారం.. విద్యార్థిని గది నుంచి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో విశ్వవిద్యాలయ దంత విభాగానికి చెందిన ఒక పురుషుడు, ఒక మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. మానసిక ఇబ్బందులు కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Live-In Relationships: సహజీవనం.. నలుగురి ప్రాణాలు బలి..!
విద్యార్థిని ఆత్మహత్య శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు విశ్వవిద్యాలయ పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆందోళనకారులతో పోలీసులు చర్చించారు. విద్యార్థిని గది నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని గ్రేటర్ నోయిడా ఏడీసీపీ సుధీర్ కుమార్ శనివారం తెలిపారు.
