Site icon NTV Telugu

Delhi Crime: 12 ఏళ్ల బాలికను మోసగించిన మహిళ.. టీ సెల్లర్‌తో పాటు ముగ్గురు మైనర్ల అత్యాచారం..

Delhi

Delhi

Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్‌తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్‌లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు అని వీరంతా టీ స్టాల్‌లో పనిచేస్తునట్లు వెల్లడించారు.

Read Also: Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’

జనవరి 1న టీ స్టాల్ యజమాని ఆ ప్రాంతంలో చెత్త ఏరుకుని పనిచేస్తే మహిళను కొత్త సంవత్సర వేడుకలు జరపుకునేందుకు అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు. బాలికను తమ వద్దకు తీసుకువస్తే బదులుగా కొంత డబ్బు ఇస్తానని సదరు మహిళకు చెప్పాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత రోజు మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపరుచుకుని నిందితులు ఉన్న ఖుర్షీద్ మార్కెట్లోని భవనం వద్ద పైకప్పు నుంచి చెత్త ఏరాలని చెప్పింది. నలుగురు నిందితులు బాలిక రాకకోసం చూసి, ఆమె రాగానే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

బాలిక నార్త్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి రెండు రోజులు మౌనంగా ఉంది. జనవరి 5న సదర్ బజార్ లో చెత్తతీయడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలోని నివసించే బంధువుతో విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను ఫిర్యాదు చేశారు. నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. టీ దుకాణం యజమాని ఛత్తీస్‌గఢ్ వాసి కాగా.. అతని దుకాణంలో పనిచేసే ముగ్గురు మైనర్లు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.

Exit mobile version