NTV Telugu Site icon

Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసు నిందితుడికి మరణశిక్ష విధించాలి… ఢిల్లీ పోలీసులు

Delhi Murder Case

Delhi Murder Case

Delhi Murder Case: ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. నిందితుడు సాహిల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించి 640 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. నిందితుడు సాహిల్‌కు మరణశిక్ష విధించేలా వాటర్‌టైట్‌ కేసును సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. షహబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలిక హత్య పక్కా ప్రణాళికతో జరిగిందని, నిందితుడికి మరణశిక్ష పడేవిధంగా వాటర్‌టైట్ కేసు పెట్టామని ఢిల్లీ పోలీసులు గురువారం చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో, పగతో జరిగిన హత్య కేసని.. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మరియు ఘటన జరిగిన నెల రోజుల్లోనే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు చార్జిషీటును సమర్పించినట్టు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్) దేవేంద్ర పాఠక్ తెలిపారు.

Read also: Comedian Satya: ‘రంగబలి’ కోసం ‘సత్యబలి’.. వాళ్లలో ఎవరినీ వదల లేదుగా!

సాక్షి హత్యకేసులో సీరియస్‌గా దర్యాప్తును నిర్వహించి, రికార్డు సమయంలో కోర్టు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేశాం. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కేసును వీలైనంత నీరుగారకుండా ఉండేందుకు ప్రయత్నించామన్నారు. మే 28న వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో మైనర్ బాలికను ప్రజలు చూస్తుండగా హత్య చేసిన నిందితుడు సాహిల్‌పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
పోక్సో సెక్షన్ 12 (పిల్లలపై లైంగిక వేధింపులు) మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ల కింద 640 పేజీల ఛార్జిషీట్‌ను మంగళవారం పోక్సో కోర్టులో దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

Read also: Vj Sunny : తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సన్నీ..

నిందితుడిపై ఆయుధాల చట్టంలోని నిబంధనలతో పాటు IPC సెక్షన్లు 302 (హత్య), 354 A (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ యొక్క అణకువను కించపరిచేలా ఉద్దేశించిన పదం, సంజ్ఞ లేదా చర్య) కింద కూడా అభియోగాలు మోపారు. ఈ భయానక హత్య దృశ్యాలు CCTV కెమెరాలో ఉన్నాయని.. ఫుటేజీలో యువకుడు కత్తితో బాలికపై 20 సార్లు కంటే తక్కువ కాకుండా అనేక మంది వ్యక్తులు చూస్తుంతడగానే హత్య చేశాడు. ఆమెను రక్షించడానికి ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఆమె శరీరంపై 34 గాయాల గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాహిల్‌ను మే 29న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అరెస్టు చేశారు. సాహిల్‌, సాక్షికి పరిచయం ఉన్నప్పటికీ తరచూ గొడవలు జరిగేవని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు. మే 27న ఇద్దరికీ గొడవ జరిగిందని.. ఆ తర్వాత సాహిల్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు .. మరుసటి రోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు.