తండ్రి వేధింపులు..అర్ధరాత్రి స్నేహితులను పిలిచి కూతురు ఏంచేసిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి.. కన్నబిడ్డలకు ఆదర్శం.. హీరో. ఇంకా ఆడపిల్లలకైతే తండ్రే సర్వస్వము..కానీ, చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే వేధింపులకు గురి చేస్తే.. బయట ఎవరో ఏడిపిస్తున్నారని తండ్రికి చెప్పాల్సిన పిల్లలు తండ్రే తమపాలిట యముడిలా తయారయ్యాడని ఎవరికి చెప్పగలరు.. తాజాగా పుట్టినప్పటి నుంచి 17 ఏళ్లు వచ్చేవరకు తమను చిత్రవధకు గురిచేసిన తండ్రిపై పగపెంచుకున్న ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకొంది. ఈ చిత్రహింసలు తగ్గాలంటే తండ్రిని చంపడమే కరెక్ట్ అనుకొంది.. స్నేహితులతో, చెల్లెళ్ళతో కలిసి తండ్రిని హతమార్చింది. ఈ దారుణ ఘటన బెంగుళూరులో చోటుచేసుకొంది.
వివరాలలోకి వెళితే.. బీహార్‌కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) అనే వ్యక్తి బెంగుళూరులోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో భద్రతా విభాగంలో పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు.. భార్య మృతిచెందడంతో పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. భార్య లేకపోవడంతో కూతుళ్లను రోజు చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు.. చెప్పుకోలేని విధంగా వారిని చిత్రవధ చేస్తూ రోజు నరకం చూపించేవాడు. ఇక ఈ బాధలను 17 ఏళ్లుగా మోస్తున్న పెద్ద కూతురు తండ్రిపై కక్ష పెంచుకొంది. ఈ బాధలు తప్పాలంటే తండ్రిని చంపాలని నిర్ణయించుకొంది. ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపి ప్లాన్ వేసింది.
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు స్నేహితులతో ఇంటికి వచ్చిన బాలిక నిద్రిస్తున్న తండ్రిపై మారణాయుధాలతో దాడి చేసింది. ఈ దాడిలో మరో ఇద్దరు కూతుళ్లు కూడా పాల్గొనడం గమనార్హం. మొత్తం కలిసి దీపక్ కుమార్ ని మృతిచెందేవరకు పొడిచి పొడిచి చంపారు. అనంతరం బాలిక స్నేహితులతో కలిసి పరారయ్యింది. సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!