Cyber Fraud: సైబర్ రాబరీ.. ఇప్పుడిదో స్మార్ట్ దోపిడీ. జస్ట్ ఒక్క లింక్.. లేదా ఒక్క ఫోన్ కాల్.. నమ్మారో అంతే..!! ఉన్నదంతా ఊడ్చేస్తారు..!! ఖాతాలో సొమ్ము అంతా ఖాళీ చేసేస్తారు..!! ఇలాంటి మోసమే హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ఓ వ్యక్తి బల్క్ వస్తువులు తక్కువ ధరకే వస్తున్నాయని నమ్మి.. సైబర్ క్రిమినల్స్ చేతిలో నిండా మోసపోయాడు.
Medha School Drugs: మేధా స్కూల్ లో ఏం జరుగుతోంది? మత్తు మందును కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు?
ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. అందరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు..ఫోన్‌కు లింక్ చేసే ఉన్నాయి. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల స్మార్ట్ దోపిడీకి కీలకంగా మారింది.. సోషల్ మీడియాలో రకరకాల లింకులు పంపిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. రూ. 50వేల విలువ చేసే వస్తువులు… రూ. 50కే ఇస్తామంటే ఆశపడని వారు ఎవరుంటారు. అలా ఆశ పడేవారిని ఈజీగా బుట్టలో వేసుకుంటున్నారు. సరిగ్గా హైదరాబాద్‌లో ఇలాగే జరిగింది. టెలిగ్రామ్‌లో బల్క్‌గా వస్తువులను తక్కువ ధరకే అమ్ముతున్నామని సైబర్ క్రిమినల్స్ ఓ లింక్ పోస్ట్ చేశారు. ఆ ప్రకటనను గుడ్డిగా నమ్మిన వ్యాపారి.. వారిని సంప్రదించాడు. ఇంకేముంది.. సైబర్ క్రిమినల్స్.. బాగా నమ్మించి.. అసలు కథ షురూ చేశారు.
The Great Pre Wedding Show : ఆసక్తికరంగా ‘ది గ్రేట్ వెడ్డింగ్ షో’ టీజర్
మెహిదీపట్నంకు చెందిన ఆ వ్యాపారి.. సైబర్ నేరగాళ్లతో రూ. 80 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, సరుకులు డెలివరీ చేయాలంటే ముందుగా 10 లక్షల అడ్వాన్స్‌గా చెల్లించాలని సైబర్ నేరగాళ్లు షరతు పెట్టారు. వారి మాటలు నమ్మిన వ్యాపారి ఆ మొత్తాన్ని వారికి పంపించాడు. డబ్బు అందిన తర్వాత కూడా వస్తువులు రాకపోవడంతో అనుమానంతో వారిని ప్రశ్నించాడు. దీంతో వారు మరో నాటకానికి తెరలేపారు. డెలివరీ పూర్తి కావాలంటే అదనంగా మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని మెలికపెట్టారు. చేసేదేమీ లేక ఆ డబ్బు కూడా పంపించాడు. అయినా సరుకులు పంపకుండా, రకరకాల కారణాలు చెబుతూ విడతలవారీగా అతని నుంచి డబ్బు గుంజుతూనే ఉన్నారు. ఇలా మొత్తం 80 లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
