Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ గ్యాంగ్‌స్టర్ హత్య జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు భద్రత నడుమ తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది పోలీసులు కళ్లలో కారం కొట్టి గ్యాంగ్‌స్టర్ ని కాల్చి చంపారు. బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే హత్య కేసులో నిందితులుగా ఉన్న కల్దీప్ జఘీనా, విజయపాల్ అనే ఇద్దరు నిందితులను ఏడుగురు పోలీసులు బస్సులో జైపూర్ నుంచి భరత పూర్ తీసుకెళ్లుతున్న సమయంలో 8 మంది వ్యక్తులు బస్సును అడ్డగించి, పోలీసుల కళ్లలో కారం చల్లి ఇద్దరిపై కాల్పులు జరిపారు. భరత్‌పూర్‌లోని హలేనా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమోలి టోల్ ప్లాజా సమీంలో ఈ ఘటన జరిగింది.
కుల్దీప్ జఘీనాపై హత్యానేరం ఉండగా.. విజయపాల్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో నిందితులుగా ఉన్నారు. కాల్పుల అనంతరం వీరిద్దరిని భరత్‌పూర్‌లోని ఆర్‌బిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కుల్‌దీప్ జఘీనా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని, విజయపాల్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్‌పి భరత్‌పూర్ మృదుల్ కచ్చవా చెప్పారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Read Also: Bride Cheating: నిత్య పెళ్లికూతురు.. నాలుగు రాష్ట్రాలు, 8 పెళ్లిళ్లు
దౌసా సహా సమీప జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం వేట కొనసాగిస్తు్నారు. ఈ సంఘటనపై అడిషనత్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మినిస్ట్రేషన్)-జైపూర్ రాహుల్ ప్రకాష్ మాట్లాడుతూ, కుల్దీప్ జఘీనాపై అనేక బుల్లెట్లు కాల్చబడ్డాయని అయితే పోలీసులు విజయపాల్‌ను దాడి నుండి రక్షించగలిగారని.. బస్సు ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీసు బృందం కాల్పులు జరపలేదని తెలిపారు.
2022 సెప్టెంబర్ 4న బీజేపీ నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యలో విజయపాల్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూవివాదంలో కృపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు కుల్దీప్ జఘీనాతో పాటు మరో నలుగురిని గత సెప్టెంబర్ 11న మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. కృపాల్ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.