Nagole Woman Death: ప్రియుడి ఇంటికి వచ్చి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్‌లో జరిగింది. వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ప్రియురాలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆమెది సూసైడేనా? మర్డరా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. వారి పేర్లు బానోత్ అనిల్ నాయక్, స్వరూప. అవివాహితుడైన బానోత్ అనిల్.. నాగోల్‌లోని అంధుల కాలనీలో ఉంటున్నాడు. ఐతే స్వరూప స్వస్థలం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల. అక్కడే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి అయింది. మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఐతే పెళ్లి అయినప్పటికీ అనిల్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ క్రమంలో కొడుకు అనారోగ్యం పేరుతో హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చూపిస్తానని ఇంట్లో చెప్పి వచ్చింది..
READ ALSO: Ladakh: ‘‘సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని తగలబెట్టే యత్నం’’.. లడఖ్‌లో హింస, లేహ్‌లో కర్ఫ్యూ..
నేరుగా సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని ప్రియుడి అనిల్ ఇంటికి వచ్చిన ప్రియురాలు స్వరూప.. అక్కడే మకాం వేసింది. వారిద్దరూ కలిసే ఉన్నారు. కానీ ఈ విషయాన్ని అనిల్ ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం కూరగాయలు కొనేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లోనే స్వరూప.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కూరగాయలకు వెళ్లి తిరిగి వచ్చిన అనిల్.. స్వరూప ఎక్కడికో వెళ్లిందని కంగారు పడ్డాడు. మరోవైపు 3 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. చివరగా బాత్‌రూమ్ తలుపు లోపలి నుంచి వేసి ఉండడంతో అక్కడే ఉందని భావించాడు. కానీ ఎంతసేపటికీ ఆమె బయటకు రాలేదు. బాత్ రూమ్ తలుపు కొట్టాడు. కానీ రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టాడు. లోపల చూడగా.. ఆమె హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయి ఉంది. ఒక్కసారిగా హతాషుడైన అనిల్.. ఏం చేయాలో అర్ధం కాక.. కూరగాయలు కోసే కత్తితో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ స్వరూప కొడుకు ఏడుస్తుండడంతో.. రక్తం కారుతున్న చేతికి ఖర్చీఫ్ కట్టుకుని..పిల్లాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు..
మరోవైపు పోలీసులు.. బానోత్ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిల్లాన్ని చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. అయితే అనిల్ నాయక్‌తో ఆ మహిళకు ఎటువంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా ఇతడి ఇంటికి రావడం ఏమిటి? భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. కుమారుడితో ఒక్కతే రావడం వెనక ఏం జరిగి ఉంటుంది? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడి దగ్గరికి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
READ ALSO: Hyderabad Keesara kidnap: అల్లుడి కంట్లో కారం చల్లి.. కూతురును కిడ్నాప్ చేసిన అత్తామామలు!
