Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable S*uicide Attempt: ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ సర్కిల్ ఇప్పుడు వివాదాలకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి పోలీసులు ప్రజా సేవ కంటే.. పర్సనల్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. కింది స్థాయి పోలీసులు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందిం.? అక్కడ ఏం జరుగుతుంది..?
నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ పరువు బజారున పడుతోంది. ఎర్ర స్మగ్లర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు దగ్గర నుంచి వివాహేతర సంబంధాల దాకా అన్నింటిలో ఖాకీలు వేలు పెడుతున్నారనే అపవాదు ఉంది. అంతే కాదు.. అంతర్గతంగానూ తోటి పోలీసులను ఉన్నతాధికారులు వేధిస్తున్నారు. దీంతో ఉదయగిరి సర్కిల్‌లో జరుగుతున్న లేటెస్ట్ పరిణామాలు ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Wife Murder Attempt: డామిట్ .. భర్తను అడ్డంగా నరికేందుకు వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది..
ఉదయగిరి సీఐ వెంకట్ రావ్ వేధిస్తున్నారంటూ సీతారాంపురం పీఎస్‌లో పనిచేసే మహిళ కానిస్టేబుల్ స్లీపింగ్ పిల్స్ వేసుకుంది. స్టేషన్ లోనే నిద్ర మాత్రలు మింగడంతో తోటి సిబ్బంది ఆమెను ఉదయగిరి హాస్పిటల్‌కి కాకుండా వింజమూరు హాస్పిటల్‌కి తరలించి.. రహస్యంగా ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆత్మహత్యా ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటూ ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ మధ్య సీతారాంపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధులలో నిర్లక్ష్యం.. అధికారుల మాటలు వినకపోవడం వంటి వాటితో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. SI కి, CI కి మధ్య విభేదాలు ఉండటంతోనే ఆయన పై సీఐ.. ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జ్యోతి అనే మహిళా కానిస్టేబుల్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని.. SI ప్రవర్తనతో సదరు కానిస్టేబుల్ కూడా ఇబ్బంది పడుతుందని CI తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని విధులు నుంచి తొలగించారు..
సీన్ కట్ చేస్తే.. తనకు.. SI శివ కృష్ణారెడ్డికి వివాహేతర సంబంధం అంట కట్టడం వల్లే మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు జ్యోతి మీడియాకు వివరించింది. SI కి, CI వెంకట రావ్‌కు మధ్య ఉన్న విభేదాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ వెంకటరావుపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. దీంతో పోలీస్ శాఖ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన జ్యోతిని విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించానంటూ కానిస్టేబుల్ జ్యోతి చెబుతున్నప్పటికీ.. ఆమెపైనే చర్యలు తీసుకోవడంపై పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది.
ఉదయగిరి సర్కిల్‌లో ఉన్నతాధికారితో పాటు.. మరో ఎస్ఐ కూడా తీవ్రమైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సమస్యలపై ఆందోళన చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం.. సామాన్య ప్రజలను బెదిరించడం వంటి పలు ఆరోపణలను సర్కిల్లో పనిచేసే ఉన్నతాధికారి మూట కట్టుకుంటున్నారు. ఆయన చర్యల వల్లే కిందిస్థాయి సిబ్బంది స్వేచ్ఛగా విధులు నిర్వహించలేకపోతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో సదరు సీఐపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మహిళా కానిస్టేబుల్ను బలి చేశారన్న టాక్ సర్కిల్ లో వినిపిస్తుంది. పోలీస్ శాఖను బజార్లో పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!