NTV Telugu Site icon

Vizag Law Student Incident: లా స్టూడెంట్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై సీఎం సీరియస్‌.. విచారణ వేగవంతం

Vizag

Vizag

Vizag Law Student Incident: విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి… పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్‌ను లవ్‌ పేరుతో ట్రాప్‌ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. తర్వాత వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడా దుర్మార్గుడు. వారి టార్చర్‌ భరించలేక రెండు నెలలు తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది బాధితురాలు. అయితే, తండ్రి గమనించి ఆమెను కాపాడాడు. విషయం తెలుసుకుని టూటౌన్‌ పీఎస్‌లో కంప్లైంట్‌ చేశారు.

Read Also: Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు

గ్యాంగ్‌రేప్‌ కేసులో ప్రధాన నిందితుడు వంశీతో పాటు అతడి స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ముగ్గురు లా చదువుతుండగా, మరొకడు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. మరోవైపు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు. వీడియోలను నిందితులు ఎవరికి పంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటు విశాఖ ఘటనపై సీరియస్‌ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమ్మాయిని రేప్‌ చేసి.. అశ్లీల ఫోటోలు తీసి, జీవితాలను నాశనం చేయడమేంటని.. ఇలాంటివారి తాట తీస్తామని హెచ్చరించారు. ఇక, విశాఖ గ్యాంగ్‌ రేప్‌ ఘటన కలకలం రేపడంతో లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. నిందితుల బ్యాగ్రౌండ్‌ ఏంటి? గతంలో నేర చరిత్ర ఉందా? అన్నది కూడా ఆరా తీస్తున్నారు.

Show comments