NTV Telugu Site icon

Prostitution racket: స్కూల్ గర్ల్స్‌ని వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా అరెస్ట్.. స్నేహితురాలి తల్లే ప్రధాన సూత్రధారి..

Prostitution Racket

Prostitution Racket

Prostitution racket: స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 17-18 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు టీనేజ్ బాలికల్ని పోలీసులు రక్షించారు. పక్కా సమాచారంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి ఓ లాడ్జిపై దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 37 ఏళ్ల నదియా అనే మహిళ చెన్నైలో తన కూతురితో కలిసి చదువుతున్న బాలికల్ని టార్గెట్ చేసింది. వారికి డ్యాన్స్ నేర్పిస్తాననే నెపంతో స్నేహం చేసి బ్యూటీషియన్ కోర్సులు కూడా నిర్వహించేందు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలకు వలేసేది.

Read Also: Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో ఐదేళ్ల బాలిక మృతి..

నదియా బాలికలకు రూ. 25,000-30,000 ఇస్తానని చెప్పి వ్యభిచారంలోకి దింపింది. చెన్నైలోనే కాకుండా ఢిల్లీ, కోయంబత్తూర్, హైదరాబాద్‌లోని కస్లమర్ల వద్దకు పంపించేందు. ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలా తల్లిదండ్రులకు సాకులు చెప్పాలనే దానిపై కూడా నదియా బాలికలకు శిక్షణ ఇచ్చేదని పోలీసులు తెలిపారు. నిందితురాలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌ల ద్వారా క్లయింట్స్‌తో డీల్ కుదుర్చుకునేది. కస్టమర్లలో కొందరు కోయంబత్తూర్, హైదరాబాద్‌కి చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు తేలింది. పాఠశాల బాలికలకు ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో నిందితురాలు వారిని టార్గెట్ చేసింది.

అయితే, కొంత కాలం తర్వాత బాలికను ఈ వ్యభిచార కూపం నుంచి బయటకు రావాలనుకుంటే, వీరి వీడియోలు ఉన్నట్లు, తల్లిదండ్రులకు చెబుతారని నదియా బెదిరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టైన వారిలో చెన్నైకి చెందిన యశ్రీ, (43), రామంద్రన్(70), సుమతి(43), రామచంద్ర(42), మాయా ఓలి(29), కోయంబత్తూర్‌కి చెందిన అశోక్ కుమార్(31) ఉన్నారు. ఏడుగురు నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. చైల్డ్ లైన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు బాలికలకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.