Chennai Murders: బంగారం దోపిడీ.. దంపతుల దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నైలోని ఫాంహౌస్ లో ఎన్ఆర్ఐ దంపతులను హత్య చేసి భారీగా బంగారం, నగదుతో పరారవుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కాపుకాసిన పోలీసులు తమిళనాడు రిజిస్ట్రేషన్ కారు (టీఎన్ 07 ఏడబ్ల్యూ 7499) ను ఆపారు. అందులో ఉన్న ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో ఉంటున్న శ్రీకాంత్ (58), అనురాధ(53) దంపతులకు చెన్నైలోని మైలవరం ప్రాంతంలో ఫాంహౌస్ ఉంది. శనివారం ఉదయం వారిద్దరూ విమానంలో చెన్నైకి వచ్చారు. వారి ఫాంహౌస్ లో నేపాల్‌కి చెందిన పదం లాల్ శర్మ వాచ్ మన్ గా, అతని కుమారుడు పధం లాలకృష్ణ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. విమానాశ్రయం నుంచి శ్రీకాంత్ దంపతులను కారులో ఫాంహౌస్ కు తీసుకొచ్చే సమయంలోనే లాలకృష్ణ మార్గమధ్యంలో తన స్నేహితుడైన పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ కు చెందిన రవిని కారులో ఎక్కించుకున్నాడు. ఫాంహౌస్ కు తీసుకెళ్లారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఫాంహౌస్ కు తీసుకెళ్లిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం వారిని లాల్‌కృష్ణ, రవి హత్య చేసి, అక్కడే పాతిపెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును నాలుగు సూట్‌కేసుల్లో సర్దుకొని కారులో చెన్నై నుంచి నేపాల్‌కు బయలుదేరారు. చెన్నై పోలీసులకు విషయం తెలియడంతో అక్కడి ఏసీపీ డాక్టర్ కన్నన్ వెంటనే ఆంధ్రాలో ఉన్న అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు ఎస్పీ మలిక గర్గ్ జాతీయ రహదారిపై ఉన్న అన్ని స్టేషన్లను అప్రమత్తం చేశారు.
టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్ష్మణ్, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్‌కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, కందుకూరు సీఐ శ్రీరామ్ నిందితులను విచారిస్తున్నారు.
నిందితులను పట్టుకున్న పోలీసులను ఎస్పీ మలిక గర్గ్ అభినందించారు. చెన్నై పోలీసులకు సమాచారం ఇచ్చామని, నిందితులతో పాటు కారు, సూట్‌కేసులను వారికి అప్పగిస్తామని తెలిపారు. కాగా, ఆ సూట్‌కేసుల్లో 50 కిలోల బంగారం, 5 కిలోల వెండి, నగదు వున్నట్టు చెన్నై పోలీసులు చెబుతున్నారు.
Telangana :పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి పయనం
తాజావార్తలు
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!