NTV Telugu Site icon

Husband Kills Wife: భార్యను టూర్‌కి తీసుకెళ్లి స్క్రూ డ్రైవర్‌తో 41 సార్లు పొడిచి చంపాడు..

Turkey

Turkey

Husband Kills Wife: టర్కీలో దారుణం జరిగింది. విహారయాత్రకు తీసుకువచ్చి భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్‌లోని ఫాతిహ్‌లోని ఒక హోటల్‌లో చోటు చేసుకుంది. నిందితుడిని బ్రిటన్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను తన భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు టర్కీకి వచ్చాడు.

Read Also: Osama bin Laden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో వైరల్ అవుతున్న ‘ఒసామా బిన్ లాడెన్’ లేఖ

హోటల్ గదిలో 26 ఏళ్ల భార్య మెడ, శరీరంపై స్క్రూ డ్రైవర్ సాయంతో 41 సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని 26 ఏళ్ల అహ్మెత్ యాసిన్‌గా గుర్తించారు. హత్య సమయంలో బాధిత మహిళ కేకలు విన్న హోటల్ సిబ్బంది అప్రమత్తమై గదిలో చూసే సరికే రక్తపు మడుగులో మహిళ పడి ఉండటాన్ని గమనించారు. నిందితుడి కోసం వెతకగా, రక్తపు మరకలు ఉన్న టీషర్టుతో పట్టుబడ్డాడు.

Read Also: Shaheen Afridi: టీ20 జట్టుకు కెప్టెన్‌ అయినందుకు సంతోషిస్తున్నా..

తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. టాయిలెట్‌లో హత్యకు ఉపయోగించిన స్క్రూ డ్రైవర్‌ని ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ ఘటన జరగడానికి మూడు రోజుల ముందే ఈ దంపతులు బ్రిటన్ నుంచి టర్కీకి వచ్చారు. తన భార్య తనకు డ్రగ్స్ అందించిందన్న వివాదంతో గొడవ చెలరేగిందని, దీంతో ఆమెను చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

Show comments