Site icon NTV Telugu

Bihar: బీహార్‌లో దారుణం.. వరుడి ముందే వధువును గన్‌తో కాల్చిన ప్రియుడు

Bihar2

Bihar2

బీహార్‌లో దారుణం జరిగింది. ఓ ప్రేమికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. పచ్చని పెళ్లిమండపంలో రక్తపాతం చిందించాడు. తనకు దక్కలేదన్న కోపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బీహార్‌లోని బక్సర్‌లోని చౌసా గ్రామంలో గ్రాండ్‌గా వివాహ వేడుకలు జరుగుతున్నాయి. బంధువులు, అతిథుల రాకతో పెళ్లి మండపం కళకళలాడుతోంది. ఇక వరుడి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుంచి భారీ ఊరేగింపుతో వధువు గ్రామమైన చౌసాకు చేరుకున్నారు. వధూవరులిద్దరూ వేదికపై దండలు మార్చుకుంటున్నారు. ఇంతలోనే వధువుకు సంబంధించిన ప్రేమికుడు వేదిక దగ్గరకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ నేరుగా వధువులోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. పెళ్లి వేడుక కాస్త గందరగోళంగా మారిపోయింది. ఏం జరుగుతుందో తెలియక అందరూ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో తొక్కిసలాట కూడా జరిగింది. ఈ అలజడిలో ప్రేమికుడు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.

ఇది కూడా చదవండి: UP: ఘజియాబాద్ పాఠశాలలో చిరుత హల్‌చల్.. విద్యార్థులు బెంబేలు.. వీడియో వైరల్

వధువు పరిస్థితి విషమంగా మారింది. రక్తపుమడుగులో ఉన్న వధువును హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మరొక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ఈ ఘటనతో వధువు కుటుంబం విచారంలో మునిగిపోయింది. ప్రస్తుతం వివాహాన్ని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని వీడియోలను పరిశీలించారు. బుల్లెట్ పేలగానే అతిథులు పారిపోయినట్లుగా కనిపించింది. ఈ పెళ్లి పట్ల వధువు ప్రియుడు అసంతృప్తిగా ఉన్నాడని.. ఇద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని ముఫుసిల్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Trump: నేను లేకుంటే పాక్ ప్రధాని షరీఫ్ చనిపోయేవాడు.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version