Site icon NTV Telugu

దారుణం: గిఫ్ట్ ఇస్తానని ప్రియురాలిని పిలిచి.. తలామొండెం వేరుచేసి

crime

crime

ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం ఎంతోమంది చనిపోతున్నారు. మరెంతోమంది చంపేస్తున్నారు. ప్రేమించినవాడు మోసం చేసారని, పెళ్ళికి ఒప్పుకోలేదని దారుణంగా ప్రేమించినవారిని హతమారుస్తున్నారు. తాజగా ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆమెను అతిదారుణంగా హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ చిత్రకూట్ జిల్లా మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్వా గ్రామానికి చెందిన విష్ణు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన స్వప్న అనే యువతి ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల యువతి ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఇక తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదని స్వప్న కూడా వేరే వ్యక్తితో పెళ్ళికి ఒప్పుకొని విష్ణును దూరం పెట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణు.. ఆమెతో మాట్లాడాలని చెప్పి మార్చి 1 న ఒక నిర్మానుష్య ప్రదేశానికి పిలిచాడు. చివరగా గిఫ్ట్ ఇస్తానని, తరువాత మాట్లాడానని చెప్పడంతో స్వప్న, ప్రియుడు పిలిచినా చోటుకు వెళ్ళింది. అక్కడ ఇద్దరి మధ్య పెళ్లి గురించి వాగ్వాదం జరిగింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అందుకు స్వప్న ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టలేనని, నువ్వు కూడా వేరే అమమయిని పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఆగ్రహించిన విష్ణు ఆమెపై దాడి చేశాడు. అప్పటికే పక్కన ఉన్న స్నేహితులు తెచ్చిన కత్తితో తల నరికి.. తలామొండెం వేరుచేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. స్థానికుల సమచారంతో మార్చి 1న స్వప్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి తాజగా విష్ణును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేయడమే కాకుండా అతడికి సహాయం చేసిన స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version