Site icon NTV Telugu

Marriage proposal: ఎఫైర్ పెట్టుకుని పెళ్లి చేసుకునేందుకు నిరాకరణ.. యువకుడి ప్రైవేట్ భాగాలను కట్ చేసిన మహిళ..

Bihar

Bihar

Marriage proposal: బీహార్‌లో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఓ వ్యక్తిపై మహిళ దారుణంగా ప్రవర్తించింది. అతడి ప్రైవేట్ పార్టుల్ని కోసేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని సరన్ జిల్లాలో చోటు చేసుకుంది. యువకుడి ప్రైవేట్ భాగాలు కత్తిరించి ఫ్లష్‌ చేసినందుకు నర్సింగ్‌హోమ్‌లో పనిచేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అభిలాష అనే మహిళ మధురలో నర్సింగ్ హోం నడుపుతోంది. అదే ప్రాంతంలోని వార్డు కౌన్సిలర్ వేదప్రకాష్‌తో గత కొన్నేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంతో అభిలాష, వేదప్రకాష్ శారీరక సంబంధం కొనసాగుతోంది. ఈ సంబంధం కారణంగా అభిలాష గర్భం దాల్చింది. పెళ్లి పేరుతో వేదప్రకాష్ తనను మోసం చేసినట్లు ఆమె ఆరోపించింది.

Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం

వేదప్రకాష్ తనను కోర్టు పెళ్లి చేసుకుంటానని చెప్పాడని పేర్కొంది. ఆ సమయంలో తను మళ్లీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన అభిలాష, అతని ప్రైవేట్ భాగాలను కత్తితో కట్ చేసి, టాయిలె‌ట్‌లో పారేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాధితుడిని పాట్నా మెడికల్ కాలేజీలో చేర్చారు. వేదప్రకాష్‌పై చేసిన దాడికి పశ్చాత్తాపడటం లేదని అభిలాష చెప్పింది.

వివాహం చేసుకునేందుకు బాధితుడు పదేపదే నిరాకరిండంతో మహిళ కలత చెంది ఈ దారుణానికి ఒడిగట్టిందని, పెళ్లి తేదీని ఏడెనిమిది సార్లు మార్చాడని ఎస్ఎస్పీ కుమార్ ఆశిష్ చెప్పారు. మహిళ ప్రైవేట్ మెడికల్ సెంటర్ పెట్టుకుని అతడితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు విచారణలో తేలింది.

Exit mobile version