Bihar Tragedy: “విషం రుచి చూడాలనుకున్నారు”.. ఐదుగురు బాలికల్లో, నలుగురు మృతి..

  • విషం టేస్ట్ చూడాలనుకున్నారు.
  • బీహార్ లో విషాదకర ఘటన..
  • నలుగురు బాలికలు మృతి..
Poison

Poison

Bihar Tragedy: ఐదుగురు బాలికలు పిచ్చి పని బీహార్‌లో సంచలనంగా మారింది. పోలానికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఒకరు మాత్రమే ప్రాణాలతో ఇంటికి వచ్చారు. ‘‘విషం రుచి ఎలా ఉంటుందో’’ చూడటానికి విషాన్ని తీసుకుని మరణించారు. ఈ సంఘటన జనవరి 29న బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో జరిగింది. ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక ప్రకారం, ఈ ఐదుగురు బాలికలు సాధారణంగా విష పదార్థాన్ని తీసుకున్నారు. ‘‘నా స్నేహితురాలు దీన్ని తిని మనం బ్రతుకుతామా, చస్తామా చూద్దాం అని చెప్పింది. కొంగలను చంపడానికి ఉద్దేశించిన విషాన్ని నీటిలో కలిపి తాగారు. నేను కొద్దిగా తాగి ఉమ్మివేశాను, దీంతో బతికాను’’ అని చెప్పింది.

Read Also: Reliance Industries: వెనిజులా ముడి చమురు కొనుగోలుకు అంబానీకి లైన్ క్లియర్.. రిలయన్స్‌కు అమెరికా లైసెన్స్

12-15 ఏళ్ల మధ్య వయసు కలిగిన నలుగురు బాలికలు విషాన్ని తాగి ఒకరి తర్వాత ఒకరు కుప్పకూలిపోవడాన్ని చూసిన మరో బాలిక ప్రాణాలతో బయటపడి, ఇంటికి పారిపోయి వచ్చింది. ఆమె కుటుంబం తాగిన విషాన్ని కక్కించడానికి వేప ఆకులతో చేసిన ద్రావణాన్ని తాగించి, విషాన్ని కక్కించారు.

అయితే, పోలీసులు చెబుతున్న కథనం దీనికి భిన్నంగా ఉంది. సరస్వతి పూజ సాయంత్రం కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో తిరుగుతున్నట్లు మా దర్యాప్తులో తేలిందని దౌద్‌నగర్ పోలీసులు చెప్పారు. తల్లిదండ్రులు వారిని కొట్టారని, దీంతోనే బాలికలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అయితే, బాధితుల తల్లిదండ్రులు మాత్రం.. అందరు అమ్మాయిలు 12-15 ఏళ్ల లోపు వారే అని వారు ఎలా ప్రేమలో పడుతారని ప్రశ్నించారు. పోలీసులు ఈ కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.