Site icon NTV Telugu

Crime: ఫ్రెండ్ తల్లితోనే ఎఫైర్.. చూసి తట్టుకోలేని కొడుకు ఏం చేశాడంటే..

Crime

Crime

Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. తన స్నేహితుడు, తన తల్లితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో ఒక యువకుడు హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలో సంచలనంగా మారింది. శనివారం ఉదయం శ్యామ్‌నర్ మల్టీలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని ఆశిష్(35)గా గుర్తించారు. అతడి గొంతు కోసి, తలపై రాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు.

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!

ప్రాథమిక దర్యాప్తులో రంజిత్, నిఖిల్, వినయ్ అనే ముగ్గురు స్థానిక వ్యక్తులు దాడి చేసినట్లు తెలిసింది. ఆశిష్‌ తన తల్లితో సంబంధాన్ని కలిగి ఉన్నాడని రంజిత్ అనుమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆశిష్‌ను రంజిత్ తన ఇంటికి రావద్దని హెచ్చరించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి, మరోసారి ఆశిష్‌ను రంజిత్ తన ఇంటి వద్ద చూసినట్లు సమాచారం. దీంతో కోపంతో తన స్నేహితుడు నిఖిల్, వినయ్‌లతో కలిసి ఆశిష్‌పై దాడి చేశారు. ముగ్గురూ ఆశిష్ గొంతు కోసి, తనపై రాయితో కొట్టి చంపారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశామని, హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరెవరైనా పాల్గొన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version