Site icon NTV Telugu

Bengaluru: భర్త పక్కన నిద్రిస్తున్న వివాహితను చంపి రూ.65 లక్షల నగలు చోరీ.. ఇందులో ట్విస్ట్ ఏంటంటే..!

Bengaluru

Bengaluru

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు-ఘోరాలు ఆగడం లేదు. ఈజీ మని కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి ఘాతుకాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగు చూసింది.

బెంగళూరులోని హీరాపూర్ ప్రాంతంలో 70 ఏళ్ల వృద్ధురాలు తన భర్త రంగనాథ్‌తో ఒంటరిగా జీవిస్తోంది. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడం.. పైగా 15 ఏళ్ల నుంచి మానసిక అనారోగ్యంతో రంగనాథ్ మంచానికే పరిమితం అయ్యాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఓ దుర్మార్గుడు ఘాతుకానికి ఒడిగట్టాడు.

హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్ వ్యాపారంలో రూ.8 లక్షలు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పుల నుంచి బయట పడాలన్న దుర్దేశంతో వృద్ధ దంపతుల ఆస్తులపై కన్నేశాడు. నగలు కొట్టేసి అప్పులు తీర్చుకోవాలని ప్రణాళిక రచించాడు. అంతే కుట్రలో భాగంగా తెల్లవారుజామున 1:03 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి భర్త పక్కన పడుకున్న శోభను అత్యంత దారుణంగా చంపేసి ఆమె మెడలో ఉన్న రూ.65 లక్షల ఆభరణాలు దోచుకెళ్లాడు.

ఇది కూడా చదవండి: Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోల హతం

అయితే రంగనాథ్‌కు వైద్యం చేసేందుకు ఫిజియోథెరపీ వైద్యుడు ఇంటికి వచ్చాడు. శోభ రక్తపుమడుగులో ఉండడం చూసి షాక్ అయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసుల రాకతో స్థానికులంతా గుమిగూడారు. వారితో పాటే ఏమీ ఎరగనట్టుగా నిందితుడు శివకుమార్ అక్కడే ఉన్నాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి సమయంలో స్కూటీపై పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. నెంబర్ ప్లేట్‌ను బట్టి ట్రాక్ చేయగా శివకుమార్‌దిగా తేలింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించాడు. ఈ పరిణామంతో అందరూ అవాక్కయ్యారు. అప్పుల నుంచి బయట పడేందుకు ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడే ప్రేక్షకుడిలా తిరగడంతో స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

Exit mobile version