Site icon NTV Telugu

హోటల్లో రొమాన్స్ చేసారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆ వీడియోలను

crime

crime

ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.

వివరాలలోకి వెలితే..  బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు. ఎవరికి తెలియదనుకొని ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. పదిరోజుల తర్వాత హోటల్‌లో స్నేహితురాలితో ఏకాంతంగా గడిపిన వీడియో.. నెట్టింట్లో ప్రత్యక్షమయింది. అది చూసి ఒక్కసారిగా కంగుతున్న యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించాడు. ఆరోజు హోటల్ గదిలో కొందరు దుండగులు సీక్రెట్ గా వారి రాసలీలలను వీడియోలు తీసి, వాటిని ఆ సైట్ లలో పోస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version