NTV Telugu Site icon

Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీని పొడిచి చంపిన మాజీ ఉద్యోగి..

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. ఓ టెక్ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లు హత్యకు గురయ్యారు. మంగళవారం బెంగళూర్ లో జరిగి ఈ జంట హత్యలు కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తి ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి అని తేలింది. బాధితులు ఫణీంద్ర సుబ్రమణ్య ,విను కుమార్ వరుసగా ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. బెంగళూర్ లోని అమృతహళ్లి అనే ప్రాంతంలో వీరిద్దరిని ఫెలిక్స్ అనే వ్యక్తి హత్య చేశాడు.

Read Also: Brij Bhushan Singh: మహిళా రిపోర్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్ సింగ్..

తనపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేసి ఫణీంద్రపై అనుమానితుడు పగ పెంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిందితుడు కత్తితో ఏరోనిక్స్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న ఫణీంద్ర, వినుకుమార్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈశాన్య బెంగళూర్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. నిందితుడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ కేసుపై తదుపరి విచారణ కోనసాగుతుందని తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు.

Show comments