Shocking: మందు తాగుదామని తీసుకెళ్లి లవర్ భర్త దారుణ హత్య..

  • మద్యం తాగుదామని చెప్పి, లవర్ భర్త దారుణహత్య..
  • బెంగళూర్‌లో ఘటన, మృతుడి భార్యతో నిందితుడికి సంబంధం..
Crime

Crime

Shocking: బెంగళూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లవర్ భర్తను ఒక వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మందు తాగుదామని బార్‌కు తీసుకెళ్లి మర్డర్ చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో కుక్కి బెంగళూర్ లోని ఒక బార్ సమీపంలో పారేశారు. నిందితుడిని బసుదేవ్ మాలిక్‌గా, హత్యకు గురైన వ్యక్తి 42 ఏళ్ల సునీల్ నాయక్‌గా గుర్తించారు. సునీల్ నాయక్ భార్య పుష్పతో నిందితుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని పోలీస్ విచారణలో తేలింది.

Read Also: Ayatollah Mojtaba Khamenei: మరణానికి చేరువలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.? వేగంగా సాగుతున్న సమాధి పనులు..

ప్లాన్‌లో భాగంగా నిందితుడు బాసుదేవ్ మాలిక్, సునీల్ నాయక్‌తో స్నేహం చేశాడు. ఘటన రోజూ ఇద్దరు మద్యం తాగేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే మాలిక్, నాయక్ గొంతు కోసి హత్య చేశాడు. మార్చి 26న బొమ్మసంద్ర పారిశ్రామిక ప్రాంతంలో మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ సంచిలో ఉంచి పారేశారు. పోలీసులు నిందితుడిపై హత్య నేరాన్ని మోపి, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంతో ఇతర వ్యక్తుల ప్రమేయం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.