సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో 4 డజన్ల కోడి గుడ్లను ఆర్డర్ చేసి ఏకంగా రూ.48,000 పోగొట్టుకుంది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని వసంత్‌నగర్‌కు చెందిన ఆ మహిళ ఈనెల 17 న ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ నుండి ఆఫర్ మెసేజ్ వచ్చింది. ఆ మహిళ మెసేజ్‌పై క్లిక్ చేయగా, 48 గుడ్లకు రూ. 49 ఆఫర్ ఉందని, గుడ్లను బుక్ చేయబోతున్నట్లు గుర్తించింది. తర్వాత ఆమె మొత్తం వివరాలను నింపింది. చెల్లింపు ఎంపికలో డెలివరీ చిరునామా మరియు మొబైల్ నంబర్‌తో సహా వివరాలను నమోదు చేసింది.. ఇక క్రెడిట్ కార్డు తో బిల్ పే చెయ్యడానికి క్రెడిట్ కార్డు డిటైల్స్ ను ఎంటర్ చేసింది..
ఆ తర్వాత ఆమె మొబైల్‌లో వచ్చిన OTPని నమోదు చేసి డబ్బు చెల్లించింది. డబ్బు చెల్లించిన తర్వాత ఆమె ఖాతా నుండి రూ. 48,199 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది..అది చూసిన మహిళ మోసపోయినట్లు తెలుసుకుంది.. వెంటనే బ్యాంకుకు తెలియజేసి క్రెడిట్ కార్డ్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది.. ఈ విషయం పై ఆ మహిళ హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఇలాంటి ఫేక్ యాడ్ లను చూసి నమ్మవద్దని పోలీసులు జనాలను హెచ్చరిస్తున్నారు..
