YouTube videos Liking Scam: ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు జస్ట్ యూ ట్యూబ్లో లైక్ చేయడం ద్వారా అధిక రాబడిని అందించే పార్ట్‌టైమ్ ఉద్యోగంపై మీకు ఆసక్తి ఉందా అని మీకు తెలియని వాట్సాప్ నంబర్‌ల నుండి మీకు కాల్‌స్ లేదా మెసేజ్లు వస్తున్నాయా? వస్తుంటే కనుక జాగ్రత్త. మీరు మోసపోయే అవకాశం ఉంది.
యూట్యూబ్ ‘లైక్ అండ్ ఎర్న్ స్కామ్’లో ముంబై పోలీసులు రెండు నెలల్లో 170కి పైగా కేసులు నమోదు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే లెక్కే లేదు, కేసుల పెట్టిన వారి కంటే మోసపోయి సైలెంట్ గా ఉంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఆన్‌లైన్ స్కామ్ యూ ట్యూబ్లో లైక్‌లు కొడితే భారీగా డబ్బులు ఇస్తామని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఉదాహరణకు, మేలో, 45 ఏళ్ల ఒక వ్యక్తిని రూ. 25.35 లక్షలు మోసం చేసినందుకు ముంబై పోలీసుల సైబర్ సెల్ ఆరుగురిని అరెస్టు చేసింది. ఆ నెలలోనే, ముంబైకే చెందిన మరో వ్యక్తిని రూ. 27.21 లక్షల మోసం చేసినందుకు రాజస్థాన్‌లోని అజ్మీర్, భిల్వాడలో ముగ్గురిని అరెస్టు చేశారు.
ఈ మోసగాళ్లు యూట్యూబ్ వీడియోలను లైక్ చేసే పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇస్తామని వాట్సాప్‌లో మోసపోయిన వ్యక్తులను సంప్రదించారని పోలీసు సీనియర్ అధికారి తెలిపారు. బ్రాండ్‌లు లేదా వీడియోలను ప్రచారం చేయడంలో నిమగ్నమైన డిజిటల్ మార్కెటింగ్ సంస్థలలో తాము భాగమని వారు ముందు నమ్మబలుకుతారు.Guntur Kaaram: ‘గుంటూరు కారం’కి డేట్స్ కష్టాలు.. మళ్లీ వాయిదా?
అందుకే తాము సోషల్ మీడియాలో ఆయా బ్రాండ్‌లు లేదా వీడియోలకి లైక్‌ల సంఖ్యను పెంచాలని చెబుతూ ముందుగా బాధితులను టెలిగ్రామ్ గ్రూపులలో చేరుస్తారు. ఆ తరువాత వారికి పంపిన వీడియోలను లైక్ చేయమని, దాని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయమని అడుగుతారు, ఆ తర్వాత ప్రతి ‘లైక్’కి రూ. 50 నుండి రూ. 150 వరకు డబ్బు చెల్లిస్తారు. మొదట్లో బాధితులు తమను పూర్తిగా నమ్మేదాకా చేసిన పనికి డబ్బు చెల్లిస్తారు. తర్వాత నిర్వాహకులు ఎక్కువ డబ్బు వచ్చే పనులు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందని చెప్పి రూ. 5,000 నుండి రూ. 5 లక్షల వరకు దండుకుంటారు. అలా చెల్లించాక కూడా పనులు చేయించుకుంటారు లైకులు కొట్టించుకుంటారు కానీ బాధితులకు చెల్లించాల్సిన ఆదాయాన్ని చెల్లించడానికి నిరాకరిస్తారు లేదా తప్పించుకుంటారు. అప్పుడు బాధితులు తమకు రావాల్సిన సంపాదనను పొందడానికి మరింత ఎక్కువ డబ్బు చెల్లించమని కూడా అడగవచ్చని అంటున్నారు. అలా వారికి తెలియకుండానే వారు ఒక విష వలయంలో చిక్కుకుంటారు.
నిజానికి ఇది స్కాం అని ముందే అర్ధం అయిపోతుంది, ఎందుకంటే మొదట రెజ్యూమ్‌ను కూడా కోరకుండా లేదా ఎటువంటి ధృవీకరణ లేదా KYC ఫార్మాలిటీలను పూర్తి చేయకుండా నేరుగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలను ఇస్తామంటే నమ్మకూడదు. అదీకాక లైక్ చేసిన క్రమ్మలో బాధితులు వేర్వేరు బ్యాంకు ఖాతాల నుండి డబ్బు పొందుతారు. నిజానికి వాళ్లు జెన్యూన్ అయితే కనుక కంపెనీ పేరు మీద అమౌంట్ పడాలి. ఇక అంతేకాక స్కామ్‌స్టర్‌లు రూట్ చేయడానికి, బదిలీ చేయడానికి, చివరికి డబ్బునుడ్రా చేయడానికి కూడా అనేక బ్యాంక్ ఖాతాలను తెరుస్తారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నేరస్థులలో కొందరు మహారాష్ట్రకు చెందినవారు, విదేశాలలో, చైనా వంటి దేశాలలో సంబంధాలు కలిగి ఉండవచ్చని కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా దోచుకున్న డబ్బు క్రిప్టో కరెన్సీలుగా కూడా మార్చబడతాయని అంటున్నారు. ఈ స్కామ్‌స్టర్‌లలో కొందరు KYC నిబంధనలు అంత కఠినంగా లేని ప్రాంతాల్లో, అలాగే విదేశాల నుండి సేకరించిన సిం కార్డ్‌లను ఉపయోగిస్తారని తెలుస్తోంది.Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. భర్తకు తెలియడంతో ఏం చేసిందంటే?
ఇక మరోపక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు, ఆధార్ నంబర్ లేదా పాన్ లేదా OTPలు లేదా ఏదైనా గుర్తింపు పత్రాలను అటువంటి తెలియని సంస్థలతో పంచుకోవడం మానుకోవాలని పోలీసులు ప్రజలను కోరుతూనే ఉన్నారు. అలాగే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా ఏదైనా యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని కూడా వారు హెచ్చరిస్తున్నారు.