ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన అక్క, 3 నెలల మేనకోడలిని హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లోని వవాసతి పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్‌హేటా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా.. తన బావమరిది ఈ హత్య చేశాడని మృతురాలి భర్త పోలీసులకు తెలిపాడు.
Read Also: Bengaluru: అమెజాన్ హెడ్‌క్వార్టర్స్ తరలింపు.. తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు
వివరాల్లోకి వెళ్తే.. మృతురాలు పర్వీన్ (30) ఇంటి ప్రాంగణంలో తన మూడు నెలల కుమార్తెను ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఈ క్రమంలో.. యువకుడు ఆ మహిళతో ఏదో విషయంపై గొడవ పడ్డాడు. దీంతో.. నిందితుడు మహిళను దుపట్టాతో గొంతునులిమి హత్య చేసినట్లు వెబ్ సిటీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ఆ తర్వాత అదే దుపట్టాతో మూడు నెలల చిన్నారిని గొంతునులిమి హత్య చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Read Also: Minister Rama Naidu: రాయలసీమకు సాగు, తాగు నీరందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం..
పరారీలో ఉన్న నిందితుడు జీషన్ (24) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తన అక్క పర్వీన్, మూడు నెలల చిన్నారి ఆఫియాను ఎందుకు చంపాడు? అని విచారణ చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో మహిళ భర్త బుర్హాన్ ఉద్యోగానికి వెళ్లాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.