Assam Sub Inspector Booked Under POCSO Over Allegations of Minor Assault: పోలీసులను రక్షక భటులని అంటారు. కానీ.. కొందరు మాత్రం భక్షకులుగా ప్రవర్తిస్తుంటారు. తమ ఒంటిపై ఉన్న ఖాకీ పవర్ చూసుకుని.. అరాచకాలకు పాల్పడుతుంటారు. అమాయకులపై దౌర్జన్యాలకు దిగుతుంటారు. ఇప్పుడు ఓ ఎస్సై అంతకుమించి హద్దులు మీరాడు. ఓ కేసు విషయమై స్టేషన్‌కి తీసుకొచ్చిన బాలికపై కన్నేశాడు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దుస్తులు తొలగించి, ఫోటోలు కూడా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. చివరికి.. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, ఆ ఎస్సై అడ్డంగా బుక్కయ్యాడు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, విధుల నుంచి సస్పెండ్ చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Medico Chaitanya: విషాదం.. పెళ్లైన రెండు నెలలకే మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?
జూన్ 21న బాల్య వివాహం కేసులో ఒక మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి బాలిక పారిపోయిందని ఫిర్యాదు రావడంతో.. పోలీసులు ఆ ఇద్దరిని వెతికి పట్టుకున్నారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే.. ఆ యువతికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి, ఆమెపైనే కన్నేశాడు. తన ఒంటిపై ఉన్న ఖాకీ దుస్తులు చూసుకొని, ఏం చేసినా చెల్లుతుందని భావించి.. ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు తీయించి, అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ఆ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. ‘నన్ను స్టేషన్‌లోనే ఆ అధికారి నన్ను బెదిరించాడు. బట్టలు తొలగించమని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు’’ అని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఈ కేసుపై రియాక్ట్ అయ్యారు.
Komatireddy Venkat Reddy: ఖమ్మం సభతో భయం పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం
అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిందని.. అయితే ఆమె పట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేశాడని డీజీపీ జీపీ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, వెంటనే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఎవరైనా అతని గురించి సమాచారం అందిస్తే.. తగిన రివార్డ్ కూడా ఉంటుందన్నారు.