Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలో వెలుగులోకి వచ్చిన ఈ హనీ ట్రాప్ ఉదంతం సమాజంలోని నైతిక విలువలకు అద్దం పడుతోంది. ఆధునిక కాలంలో టెక్నాలజీని, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పన్నే ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కుకుని ఎందరో గౌరవప్రదమైన వ్యక్తులు తమ పరువును, సంపాదనను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సమాజంలో పేరుప్రఖ్యాతలున్న వారి బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. చట్టం పట్ల భయం లేకుండా, వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ సాగిస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుండగా.. పోలీసులు తీసుకున్న ఈ చర్య ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసింది.
అనంతపురం హనీ ట్రాప్ కేసు..
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ భారీ హనీ ట్రాప్ కేసులో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉన్న ఒక ముఠా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వీరు సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన ప్రభుత్వ అధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను తమ టార్గెట్లుగా ఎంచుకుంటారు. ముందుగా మహిళా సభ్యులు ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని.. మాటలతో ఆకర్షించి తమ గొంతులో బంధిస్తారు. నమ్మకం కుదిరాక, బాధితులను ఏకాంతంగా కలవడానికి రమ్మని ఆహ్వానిస్తారు. వారు ఇంటికి రాగానే, ముందే ఏర్పాటు చేసుకున్న రహస్య కెమెరాల ద్వారా ఏకాంత క్షణాలను రికార్డు చేస్తారు.
బ్లాక్‌మెయిల్ అస్త్రాలు..
వీడియోలు రికార్డ్ చేసిన వెంటనే ముఠాలోని మిగిలిన సభ్యులు రంగప్రవేశం చేస్తారు. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని.. లేదా బాధితులపై రేప్ కేసు నమోదు చేస్తామని బెదిరిస్తారు. అంతేకాకుండా.. మహిళా సంఘాలతో ధర్నాలు చేయించి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. పరువు పోతుందనే భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. నగదు ఇవ్వలేని పక్షంలో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం ఈ ముఠా ప్రత్యేకత.
పోలీసుల చర్యలు..
బాధితుల సంఖ్య పెరగడంతో కొందరు ధైర్యంగా ఎస్పీ జగదీష్ను ఆశ్రయించారు. విచారణలో సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ముఠాకు కొంతమంది పోలీసు అధికారుల సహకారం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో.. శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ఈ కేసు జిల్లాలో ఉన్నత వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!