BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు

  • ఆగస్ట్ 7న మైనర్‌పై భార్గవ్ అత్యాచారం
  • బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం
  • భార్గవ్, అతడిని ప్రోత్సహించిన బాలిక తల్లిపై పోక్సో కేసు
Be Alert

Be Alert

అనకాపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్య కు దూరంగా ఉంటున్న ఓ వ్యక్తి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ మహిళ కూతురు మీద కూడా కన్నేశాడు ఈ కామంధుడు.. చిన్న పిల్లా వద్దు అని చెప్పి అడ్డు కోవాల్సిన ఆ తల్లి కూడా ప్రోత్సహించింది. దీంతో ఆ మృగాడు బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఐతే బాలిక ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఆ కసాయి తల్లి ఎవరు? ఓ వైపు తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్గవ్.. మహిళ కూతురుపైనా కన్నేశాడు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేసింది. బాత్‌రూమ్‌ క్లీనింగ్‌కు వాడే కెమికల్ లిక్విడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

అనకాపల్లికి చెందిన ఓ వివాహిత తన భర్తతో తలెత్తిన విభేదాలతో ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తెతో కలిసి వేరుగా ఉంటోంది. స్థానిక చేపల మార్కెట్ వద్దనున్న సచివాలయంలో పనిచేస్తున్న భార్గవ్ ప్రకాశ్ గతంలో భార్యతో గొడవపడి ప్రస్తుతం శారదానగర్లో ఉంటున్నాడు. బాలిక తల్లికి, అతడికి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో అతడి కన్ను బాలికపై పడింది. ఈ విషయం తెలిసీ.. బాలిక తల్లి అతడిని అడ్డు చెప్పకుండా ప్రోత్సహించింది. ఆగస్ట్ 7న భార్గవ్ అత్యాచారానికి పాల్పడగా.. అదే రోజు బాలిక బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలికను తల్లి చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పోలీసుల విచారణలో బాధితురాలు జరిగిందంతా చెప్పింది. అత్యాచారానికి పాల్పడిన భార్గవ్, అతడిని ప్రోత్సహించిన బాలిక తల్లిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తల్లితో వివాహేతర బంధం పెట్టుకుని కూతురుపై కన్నేసి అత్యాచారం చేసిన మృగాన్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.