మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అకోలాలో ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా వేడుకల సందర్భంగా బాలిక తల్లి గర్భా ఆడేందుకు బయటకు వెళ్లినపుడు.. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గర్భా ఆడేందుకు వెళ్లేముందు బాబు, పాప ఇద్దరిని తన భర్త దగ్గర వదిలేసి వెళ్లానని బాధితురాలి తల్లి చెప్పింది. తిరిగి వచ్చిన తర్వాత కూతురు నొప్పితో ఇబ్బంది పడిదంని.. ఏంటని బాలికను ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. బాలిక జరిగిన సంఘటన గురించి తల్లికి చెప్పడంతో.. ఆమె బాలిక ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతోంది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో యాక్ట్ కింద.. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు.