Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వినయ్ సింగ్ అనే వ్యక్తి తన సహోద్యోగి, ప్రియురాలు అయిన మింకీ శర్మ(32) తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో దారుణంగా హత్య చేశారు. వీరిద్దరు ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. మింకీ శర్మ హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తోది.
పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం, మింకీని హత్య చేసిన నిందితుడు ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి, తలను శరీరం నుంచి వేరు చేసి, ఆ భాగాలను గోనెసంచిలో పెట్టి, యమునా నదిపై ఉన్న వంతెన సమీపంలో విసిరేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కనిపించకుండా పోయిన శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిని ఆగ్రాలోని తేధీ బగియా నివాసి మింకీ శర్మగా గుర్తించారు. ఆమె సంజయ్‌ప్లేస్ లోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుందని, నిందితుడు అదే సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
Read Also: I Love My Kidneys: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇవి తినకండి.. ఎక్స్‌పర్ట్ వార్నింగ్.!
నిందితుడు, బాధితురాలు రెండేళ్లకు పైగా సంబంధంలో ఉన్నారు. గత ఆరు నెలలుగా మింకీ మరో వ్యక్తితో సంబంధంలో ఉందని వినయ్‌కు తెలియడంతో వారి మధ్య గొడవలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. జనవరి 23న మింకీ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె తిరిగి రాకపోవడతో మిస్సింగ్ కంఫ్లైంట్ ఇచ్చారు. జనవరి 24న ఎత్మదుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ వంతెనపై ఒక గోనె సంచిలో తల లేని మృతదేహం లభ్యమైంది. సీసీ టీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి కార్యాలయం నుంచి గన్నీ బ్యాగ్‌ను తీసుకుని జవహర్ వంతెన వైపు స్కూటర్‌పై వెళుతున్నట్లు కనిపించింది. నిందితుడిని వినయ్ సింగ్‌గా గుర్తించారు. విచారణ సమయంలో, అతను నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
