NTV Telugu Site icon

UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..

Up

Up

UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చెప్పబడిన వివరాల ప్రకారం.. వితంతువైన తల్లిపై అత్యాచారం చేసిన కేసులో జిల్లా కోర్టు నిందితుడు అబిద్‌కి జీవితఖైదు విధించింది. ఈ సంఘటన 2023 జనవరి 16న జరిగింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం–‘‘భర్త చనిపోయాక కొడుకు తన భార్యలా ఉండాలని బలవంతం చేశాడు. ’’ అని పేర్కొంది. దీనిపై నెటిజన్లన నుంచి బలమైన ప్రతిస్పందన వచ్చింది. వీరిలో చాలా మంది న్యాయ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.

Read Also: Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..

‘‘ఈ సంఘటన చాలా విచారకరం, ఖండించదగినది. నిందితుడు అబిద్‌కు కోర్టు జీవిత ఖైదు విధించడం న్యాయ వ్యవస్థ ఈ తీవ్రమైన నేరాన్ని తీవ్రంగా పరిగణించిందని రుజువు చేస్తుంది. ఈ కేసు సమాజంలో ప్రబలంగా ఉన్న వక్రీకరించిన మనస్తత్వం, అసాధారణ కుటుంబ గతిశీలతను హైలైట్ చేస్తుంది. ఇది చట్టానికి, సమాజం రెండింటికీ సవాలుగా ఉంది, బాధితురాలికి ఏమి జరిగింది అనేది సహించరానిది మరియు క్రూరమైనది, మరియు అలాంటి నేరాలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కఠినమైన జరిమానాలతో శిక్షించబడాలి.’’ అని ఒక వ్యక్తి పోస్ట్ చేశాడు. మరికొందరు నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరొకరు తల్లి పట్ల ఇంత దుర్మార్గగంగా ఎలా వ్యవహరించాడు.. అలాంటి వారికి ఏ శిక్ష సరిపోదని అన్నారు.