Site icon NTV Telugu

Vijayawada Crime: సినిమా ఛాన్స్‌ అంటూ ఎర.. ఆడిషన్స్‌ అంటూ లాడ్జికి పిలిచి…

Crime

Crime

Vijayawada Crime: సోషల్‌ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్‌ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్‌ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది..

Read Also: Election Results: నేడు 3రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీ జెండా ఎగిరేనో..?

విజయవాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినిమా ఆడిషన్స్ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతికి ఇన్ స్టాలో పరిచయం చేసుకున్నాడు విజయవాడకు చెందిన సాయితేజ.. బీసెంట్ రోడ్ లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న సాయి తేజ.. విజయవాడకు చెందిన యువతికి సినిమాలో అవకాశం అంటూ ఎర వేశాడు.. ఇక, సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని నమ్మబలికాడు.. తన ప్లాన్‌ ప్రకారం.. యువతిని లాడ్జికి రప్పించాడు.. లాడ్జిలో ఆ యువతిపై అత్యాచారయత్నం చేశాడు.. అయితే, సాయితేజ నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఇంటికి వెళ్లి.. జరిగిన ఘటనకు తన తల్లికి చెప్పి గోడున విలపించింది.. ఆ తర్వాత బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన గవర్నర్ పేట పోలీసులు.. నిందితుడు సాయిని అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎవ్వరినీ పడితేవారిని నమ్మి.. మోసపోవద్దు అని సూచిస్తున్నారు పోలీసులు.

Exit mobile version