Madhya Pradesh : ఆ ఇంజనీర్‌కు 5 మంది భార్యలు.. ఏడాదికో పెళ్లి?
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఐదుగురు భార్యలు
- ఎస్పీకి కంప్లేంట్ ఇచ్చిన మొదటి భార్య
- న్యాయం చేయాలని వేడుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఒకరిద్దరు కాదు ఐదుగురు భార్యలు ఉన్నారు. ఇంజనీర్ మొదటి భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఇన్‌చార్జి ఎస్పీని వేడుకున్న మహిళ.. తన భర్త పని సాకుతో చాలా రోజులుగా ఇంటి నుంచి బయటే ఉంటున్నాడని తెలిపారు. పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ఆమె చెప్పారు. అంతే కాదు నిందితుడైన భర్త ఇప్పుడు విదేశాలకు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు.
READ MORE: FLASH BACK Movie: యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వస్తోన్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఆ మహిళకు 2018 మే 13న వివాహం..
ఫిర్యాదుతో గ్వాలియర్‌లోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఓ మహిళ తనకు మురార్ టికోనియా నివాసి రుస్తమ్ సింగ్‌తో మే 13, 2018న వివాహం జరిగినట్లు తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త రుస్తమ్ సింగ్ ఓ విదేశీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయినప్పటి నుంచి ఉద్యోగం పేరు చెప్పి.. చాలా రోజులుగా ఇంటికి రావడం లేదు. ఆమెకు అనుమానం రావడంతో విచారించడం మొదలు పెట్టింది. తన భర్త తనతో పాటు మరో నలుగురిని పెళ్లి చేసుకున్నట్లు విచారణలో తేలింది. అంతే కాదు భర్త కుటుంబానికి కూడా ఇదంతా తెలుసు. వారే దగ్గరుండి జరిపిస్తున్నారు. ఏడాదికో పెళ్లి చొప్పున ఇప్పటికే 5 పెళ్లిళ్లు చేసుకున్నాడు.
READ MORE:Thota Trimurthulu: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందా..?
ఇలా భార్యలందరినీ మోసం..
తమ కుమారుడికి పని సాకు చెబుతూ.. భర్త కుటుంబ సభ్యులే వేర్వేరు చోట్ల పెళ్లి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు. నిందితుడు భర్త రుస్తమ్ సింగ్ పని సాకు చూపుతూ.. ప్రతి భార్యను ఇలాగే మోసం చేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఎస్పీ రాకేష్‌కుమార్‌ను ఆశ్రయించారు. 2022లో తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టానని, అది కోర్టులో పెండింగ్‌లో ఉందని బాధితురాలు తెలిపారు. భర్త విదేశీ కంపెనీలో పనిచేస్తున్నాడని.. అందుకే ఇప్పుడు విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలిపారు. విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహిళా క్రైం డీఎస్పీ కిరణ్ అహిర్వార్ బాధితురాలికి హామీ ఇచ్చారు.]
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!