Mahabubabad Crime: మంత్రాల నెపంతో వ్యక్తి దారుణ హత్య..
- మంత్రాల నేపంతో వ్యక్తి దారుణ హత్య..
- మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad Crime: మంత్రాల నేపంతో వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లం యాకయ్య అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. తనపై మల్లం యాకయ్య మంత్రాలు చేశాడు అనే అనుమానంతో నడిరోడ్డుపై దారుణంగా కొట్టి చంపానని నిందితుడు గ్రామస్తులకు తెలిపాడు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. యాకయ్యనే మంత్రాలు చేశాడని అనుమానం ఎందుకు వచ్చిందని నిందితున్ని ప్రశ్నించాగా.. అతనే నాపై మంత్రాలు చేశాడు అందుకే తనకు కోసం కాపు కాచి చంపానని ఒప్పుకున్నాడు. దీంతో యాకయ్య కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితున్ని పట్టుకుని, తాళ్లతో చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులో తీసుకున్నారు. యాకయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అసలు యాకయ్యనే మంత్రాలు చేశాడని నిందితుడికి ఎవరు చెప్పారు? నిందితునికి మృతి చెందిన యాకయ్య ఇద్దరు బంధువులా? లేక ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అనే రీతిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా నిమిత్తం కుటుంబ సభ్యులకు యాకయ్య మృత దేహాన్ని అప్పగించనున్నారు పోలీసులు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
A man was brutally murdered on the pretext of mantras in Mahabubabad, man was brutally murdered, pretext of mantras in Mahabubabad
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!