A man From Karnataka Physically Assaulted His Fiance And Killed: ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిన ఆ యువకుడికి.. మరో ఆరు నెలల్లో పెళ్లి ఉంది. అమ్మాయి మేజర్ (18 ఏళ్లు నిండేందుకు) అవ్వడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. ఆలోపు వేచి ఉండాలని యువతి తరఫు బంధువులు చెప్పారు. కానీ.. అప్పటివరకూ వేచి ఉండలేకపోయిన ఆ యువకుడు, ఓ కీచక పనికి పాల్పడ్డాడు. కాబోయే భార్యపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అరెస్ట్ భయంతో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన తాలూకాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Dr Vaishali Kidnap Case: ఎగ్జామ్స్ సెంటర్ కు కిడ్నాప్ కు గురైన వైశాలి.. అక్కడ భారీ భద్రత
కడలూరు గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితమే కోణనూరు సమీపంలోని రామన కొప్ప గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే.. ఆ అమ్మాయి మేజర్ అవ్వడానికి మరో 6 నెలల సమయం ఉంది. ఈలోపే పెళ్లి చేస్తే.. వ్యవహారం తేడా కొడుతుందన్న ఉద్దేశంతో, అమ్మాయి మేజర్ అయ్యాకే పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అయితే.. దినేశ్ మాత్రం అంతవరకు వేచి ఉండలేకపోయాడు. ఎలాగైనా తనకు కాబోయే భార్యతో లైంగికంగా కలవాలని అనుకున్నాడు. ఓసారి కలుద్దామని చెప్పి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ఆ యువతి.. తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వాళ్లు యువకుడ్ని నిలదీశారు. పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా ఇదేం పాడు పని అని నిలదీశారు.
Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
దీంతో.. దినేశ్ ఆ యువతిపై పగ పెంచుకున్నాడు. విషయాన్ని గోప్యంగా ఉంచకుండా, నలుగురికి చెప్పి తన పరువు తీసిందని ఆమెని చంపాలని నిర్ణయించుకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఈనెల 28న యువతి ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారం తెలుసుకొని, నేరుగా ఇంటికి వెళ్లి, ఆమె గొంతునులిమి చంపేశాడు. అయితే.. పరువు పోతుందన్న భయంతో మృతిరాలి తల్లి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలో అత్యాచారానికి గురైందని, కాబోయే భర్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తేలింది. తనని అరెస్ట్ చేస్తారన్న భయంతో.. దినేశ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.