NTV Telugu Site icon

Extramarital Affair: ఆటో డ్రైవర్‌తో భార్య ఎఫైర్.. వేట కొడవలితో భర్త దాడి

Auto Driver Wife Affair

Auto Driver Wife Affair

A Man Attacked On Auto Driver With Axe For Having Close Relationship With Wife: ఒక ఆటోడ్రైవర్‌తో తన భార్య సన్నిహితంగా ఉండటం చూసి అనుమానం పెంచుకున్న భర్త.. ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందనుకొని, ఆటో డ్రైవర్‌పై వేట కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖానాపురంకు చెందిన ఏ.నాగరాజు, సతీష్ మంచి స్నేహితులు. నాగరాజు తన భార్యతో కలిసి రైతుబజార్‌లో కూరగాయలు విక్రయిస్తుండగా.. సతీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నాగరాజుతో ఉన్న స్నేహం దృష్ట్యా.. సతీష్ తరచుగా అతని ఇంటికి వెళ్తూ వస్తుంటాడు. ఈ క్రమంలోనే నాగరాజు భార్యతోనూ సాన్నిహిత్యం పెరిగింది.

Remi Lucidi: విషాదాంతంగా ముగిసిన సాహస యాత్రికుడి ప్రయాణం.. 68వ అంతస్తు నుంచి పడి..

మొదట్లో నాగరాజు తన భార్య, సతీష్ మధ్య ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు కానీ.. రానురాను ఆ ఇద్దరి మధ్య చనువు పెరగడం చూసి, అతనికి డౌట్ వచ్చింది. తాను లేని సమయంలో ఆ ఇద్దరు తరచుగా కలుసుకోవడం కోసం.. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందేమోనని అనుమానించాడు. దీంతో.. అతడు ఆ ఇద్దరిని మందలించాడు. తన భార్య నుంచి దూరంగా ఉండాలని సతీష్‌కి చెప్పాడు. అయినా.. ఆ ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇద్దరు తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది గమనించిన నాగరాజుకి కోపం కట్టలు తెంచుకుంది. తన భార్య నుంచి దూరంగా ఉండమని మందలించినా వినకపోవడంతో.. సతీష్‌ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

Cessna 177: సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. కారణమిదే.. చివరికి ఏమైంది?

ఆదివారం సతీష్ ఖానాపురంలోని ఆటో అడ్డాలో కూర్చుని ఉన్నాడన్న సంగతి తెలుసుకొని.. నాగరాజు వేట కొడవలితో అక్కడికి వెళ్లాడు. సతీష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే వేట కొడవలితో సతీష్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో సతీష్ కాలికి, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో.. ప్రాణాపాయం తప్పింది. సతీష్‌ని ఆసుపత్రికి తరలించారు. అటు, దాడికి పాల్పడిన తర్వాత నాగరాజు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్యతో సతీష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే ఈ దాడికి పాల్పడ్డానని నాగరాజు అంగీకరించాడు.