Teacher Robbery: తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు.. ఆపై చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Government Teacher Arrested In Robbery Case In Sangareddy: అతడు ఒక ఉపాధ్యాయుడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతో, తానూ బుద్ధిగా ఉండాల్సిందిగా పోయి.. చెడు వ్యసనాలకు బానిసై, వక్రమార్గం పట్టాడు. తోటి ఉద్యోగినికి బూతు మెసేజ్‌లు పంపాడు. అంతటితో ఆగకుండా.. చోరీకి సైతం పాల్పడ్డాడు. చివరికి అడ్డంగా దొరికిపోయి, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆ దుండగుడి పేరు సార సంతోష్. జోగిపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తొలుత అందరితోనూ సఖ్యతగానే వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తోటి ఉద్యోగినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో మంచిగా ఉన్నట్టు వ్యవహరించి, ఆ తర్వాత నిజస్వరూపం చూపించాడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడం మొదలుపెట్టాడు. మొదట్లో అలాంటివి పంపించొద్దని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికీ మారకపోవడంతో.. పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. అతడ్ని సస్పెండ్ చేశారు. తనకు బుద్ధి వచ్చిందని చెప్పడంతో.. ఇటీవలే తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
Love Tragedy: తన ప్రేమని అంగీకరించలేదని.. నడిరోడ్డుపైనే..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
పోనీ.. అప్పటినుంచైనా సంతోష్ పూర్తిగా మారాడా? అంటే అదీ లేదు. చోరీకి పాల్పడి జైలుకెళ్లాడు. ఈనెల 10వ తేదీన విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన రాములు ఓ బ్యాంకులో రూ. 1.50 లక్షలు డ్రా చేశాడు. భార్యతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఇది గమనించిన సంతోష్.. వారిని ఫాలో అవుతూ వచ్చాడు. మార్గమధ్యంలో కూరగాయల కోసం రాములు, అతని భార్య ఆగారు. ఇదే సరైన సమయం అని భావించి.. సంతోష్ రాములు వద్దనున్న డబ్బులు తీసుకొని, అక్కడి నుంచి ఉడాయించాడు. అతడ్ని వెంబడించినా, కనుచూపు మేర కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంతోష్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ఈనెల 17వ తేదీన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకొని, రాములకు తిరిగి ఇచ్చారు. సంతోష్‌ను రిమాండ్‌కు పంపారు. అతడో ఉపాధ్యాయుడు అనే విషయం తెలిసి.. పోలీసులు విస్తుపోయారు.
Jacqueline Fernandez: అతడు నా కెరీర్‌ని నాశనం చేశాడు.. జాక్వెలిన్ ఆవేదన
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!